Andhra Pradesh Congress Lok Sabha Candidates List With 9 Segments: ఏపీలో పాగా వేయాలనే లక్ష్యంతో భారీ వ్యూహం రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. చివరి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ప్రాధాన్యం దక్కింది.
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
MLA Prakash Goud: గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం తన కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లోనే ఉంటానని, కాంగ్రెస్ లోకి చేరబోనని స్పష్టం చేశారు.
Telangana Congress Party: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క పగబట్టారని అన్నారు. ఆయనను రాజకీయాల్లో తానే తీసుకొచ్చానంటూ గుర్తు చేశారు. కనీసం విక్రమార్కకు ఆ కృతజ్ఞత కూడా లేదంటూ వీహెచ్ మండిపడ్డారు. ఈ ఘటనతో కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది.
Loksabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకీ చెందిన నేత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలకు తెలియకుండా బాత్రూమ్ లోకి దూరినట్లు కొందరు గమనించారు. వెంటనే సదరు నేతను పట్టుకుని చివాట్లు పెట్టి, చెప్పుదెబ్బలతో దేహాశుద్ది చేశారు. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Mahabubabad Congress Meeting: సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈనేపథ్యంలో జరిగిన సభలో జనాలు లేక సీఎం రేవంత్ అరగంటపాటు బస్సులోనే ఎదురుచూసినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలపై గుర్రుగా కూడా ఉన్నట్లు సమాచారం.
MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
Komatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొందరు ఓవైసీ బ్రదర్స్ ను చంపడానికి ప్లాన్ లు చేస్తున్నారని ఆయన అన్నారు. జైలులో పెట్టి స్లోపాయిజన్ పేరుతో హత్య చేస్తారని అనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ను పెంచింది.
K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.