Former India Coach Ravi Shastri Feels India Wins WTC Final 2023 Title vs Australia: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023కి సమయం దగ్గరపడుతోంది. ప్రతిష్టాత్మక పోరులో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7-11 మధ్య ఈ మెగా పోరు జరగనుంది. గత టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా.. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా కూడా ట్రోఫీ ఒడిసిపట్టాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు బలంగానే ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 మ్యాచ్ ఇంగ్లాండ్‌లో జరుగుతుండటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. ఎందుకంటే దాదాపుగా ఆసీస్ పరిస్థితులే ఇంగ్లీష్ గడ్డపై ఉంటాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఏ జట్టు విజేతగా (WTC Final 2023 Prediction) నిలుస్తుందనే దానిపై పలు దేశాల పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చాలామంది ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని అంటున్నారు. ఈ విషయంపై భారత మాజీ హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించాడు. ఆస్ట్రేలియా ఫేవరేట్ అయినా.. గెలవడానికి టీమిండియాకు ఒక్క రోజు చాలు అని పేర్కొన్నాడు.
'డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతోందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఆస్ట్రేలియా ఫేవరెట్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్. ఒక్క రోజు బాగా ఆడకపోయినా.. మ్యాచ్ చేజారినట్లే. కాబట్టి ఆస్ట్రేలియా కూడా జాగ్రత్తగా ఆడాలి' అని రవిశాస్త్రి అన్నాడు. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా విజేతగా నిలిచి పదేళ్లవుతోంది. 2013లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత్ ఐసీసీ ట్రోఫీ (ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ)ని గెలిచింది. గత పదేళ్లలో రెండుసార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది.
పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువుని భారత్ ఈ సారి తీర్చుకుంటుందని భారత్ మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'ఐసీసీ టోర్నీల్లో ఏ జట్టు అయినా గట్టిగా పోరాడాల్సిందే. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. భారత్ మంచి క్రికెట్ ఆడలేదని నేను అనట్లేదు. మన ప్లేయర్స్ చాలా మంచి క్రికెట్ ఆడారు. అయితే కొన్నిసార్లు అదృష్టం కలిసి రాలేదు. ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉంది. నేను కోచ్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పాను. గత 3-4 ఏళ్ల నుంచి ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉందని నమ్ముతున్నా. ఆ శక్తి ఆటగాళ్లలో ఇప్పటికీ ఉంది. భారత్ ఈ సరి కప్ గెలుస్తుంది' అని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. కీపర్‌గా కేఎస్ భరత్‌కు నో ఛాన్స్! భారత్ తుది జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.