Dhoni Political Entry: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ థోనీ రాజకీయాల్లో రానున్నారా అంటే ఆయన సన్నిహితుల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది. మిస్టర్ కూల్, నిర్ణయాలు తీసుకోవడంలో సమర్ధుడైన ధోనీ రాజకీయాల్లో వస్తే ఇక సంచలనమేనని అభిమానులు నమ్ముతున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీకు కేవలం బ్యాటింగ్, కీపింగ్ పరంగానే కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలడనే పేరుంది. వ్యూహాలు పన్నడంలో ధోనీ దిట్ట. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని ఇంకా వదలడం లేదు. వయసు మీద పడుతున్నా ధోనీ ఇంకా ఆ జట్టుకు సేవలు అందిస్తూనే ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెల్చుకున్న ఏకైక కెప్టెన్ ఇతడు. ఐపీఎల్ తప్ప అన్నింటికీ దూరమైన మహేంద్ర సింగ్ ధోనీ వివిధ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడు అతడి పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలో ధోని రాజకీయాల్లో ప్రవేశిస్తాడనే ప్రచారం జరుగుతోంది.
మహేంద్ర సింగ్ ధోని రాజకీయ ప్రవేశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ధోనీ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తోంది. మంచి రాజకీయ వేత్త కాగలిగే లక్షణాలు, రాజకీయవేత్తగా రాణించే సామర్ధ్యం ధోనీకు ఉన్నాయని రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాల్లో రావాలా వద్దా అనేది పూర్తిగా అతడి నిర్ణయమేనన్నారు. ఒకవేళ ధోనీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తే పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తాడని గంగూలీ, తాను భావిస్తున్నట్టు చెప్పారు.
Also read: PM Svanidhi Scheme: ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు..2.5 లక్షలు పొందే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి