India vs Netherlands: టీమిండియా ఆటగాళ్లకు క్వాలిటీ లేని ఫుడ్.. ఏంటి మరీ ఇలానా..!

India Players Food: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో క్వాలిటీ లేని ఫుడ్‌తో టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత లంచ్‌లో ఇచ్చిన ఫుడ్‌పై కంప్లైంట్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 09:47 AM IST
  • ఫుడ్‌పై టీమిండియా ఆటగాళ్లు కంప్లైంట్
  • ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు
  • రేపు నెదర్లాండ్స్‌తో రెండో మ్యాచ్
India vs Netherlands: టీమిండియా ఆటగాళ్లకు క్వాలిటీ లేని ఫుడ్.. ఏంటి మరీ ఇలానా..!

India Players Food: పాకిస్థాన్‌పై విజయంతో టీ20 వరల్డ్ కప్‌ ప్రయాణాన్ని విజయంతో ఆరంభించిన టీమిండియా.. ఈ నెల 27న నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం భారత జట్టు సిడ్నీకి చేరుకుంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాళ్లు బిజీబిజీగా గడిపారు. అయితే ఫుడ్‌ సరిగాలేదంటూ టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత లంచ్‌లో పెట్టిన ఫుడ్‌పై టీమిండియా ప్లేయర్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్ సరిగా లేదని.. అది కూడా చల్లగా ఉందని కంప్లైంట్ చేశారు. ప్రాక్టీస్ చేసి వచ్చిన ఆటగాళ్లకు కేవలం శాండివిచ్‌లు.. సాధారణ ఆహారం ఇచ్చారని బీసీసీఐ మండిపడింది. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. 

ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ద్వైపాక్షిక సిరీస్‌లో హోస్ట్ అసోసియేషన్ క్యాటరింగ్ బాధ్యతలు నిర్వహిస్తుందని.. ప్రాక్టీస్ సెషన్ తరువాత ఎప్పుడు వేడిగా ఉన్న ఆహారం అందిస్తారని చెప్పారు. ఐసీసీ టోర్నమెంట్స్‌లోనూ ఇలానే వేడి ఆహారం అందిస్తున్నారని తెలిపారు. అయితే సిడ్నీలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసి వచ్చిన తరువాత గ్రిల్ కూడా చేయని చల్లని శాండ్‌విచ్ పెట్టారని.. అది కూడా చాలా సాధారణంగా ఉందన్నారు.

గురువారం సిడ్నీలో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన టీమిండియా.. నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి సెమీస్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ తరువాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లతో పోటీపడనుంది.

ప్రస్తుతం టీ20 వరల్డకప్‌లో భారత్‌ హాట్ ఫేవరేట్‌గా మారింది. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోగా.. రెండోసారి పొట్టి కప్‌ను ముద్దాడాలని 15 ఏళ్లుగా కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగినట్లే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను తొలి మ్యాచ్‌లోనే చిత్తుచేసి ప్రపంచకప్‌ వేటను ఘనంగా ఆరంభించింది. 

రేపు నెదర్లాండ్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. టీమ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ లోటు కనిపిస్తుండడంతో రిషబ్ పంత్‌ను టాప్‌-11లోకి తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది. అక్షర్ పటేల్ స్థానంలో రిషబ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ ప్లేస్‌లో చాహల్‌ను తీసుకునే ఛాన్స్‌ ఉంది.

Also Read: నేను చెత్తగా ఆడాను.. నా బ్యాటింగ్ నాకే అసహ్యం వేసింది! ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Also Read: అబ్బా డేవిడ్ వార్నర్‌.. ఏమన్నా ఫీల్డింగ్ చేశావా! వీడియో చూసి తీరాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News