IPL 2025 SRH Matches: ఐపీఎల్ 2025 సీజన్ 18 మార్చ్ 22 నుంచి ప్రారంభమై 65 రోజులు పాటు జరుగుతుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 13 నగరాల్లో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ వేదిక కోల్‌కతా కాగా ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదిక హైదరాబాద్. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు, ఎవరితో ఉన్నాయో తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025 సీజన్ 18లో లీగ్ మ్యాచ్‌లు మార్చ్ 22 నుంచి మే 18 వరకూ జరుగుతాయి. మే 19 నుంచి మే 24 వరకు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇక మే 25న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఢిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
మార్చ్ 23 రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్‌లో
మార్చ్ 27 లక్నో సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్‌లో
మార్చ్ 30 ఢిల్లీ కేపిటల్స్‌తో విశాఖపట్నంలో
ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో కోల్‌కతాలో
ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్‌లో
ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో హైదరాబాద్‌లో
ఏప్రిల్ 17న ముంబై ఇండియన్స్‌తో ముంబైలో
ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్‌లో
ఏప్రిల్ 25న చెన్నై సూపర్‌కింగ్స్‌తో చెన్నైలో
మే 2న గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్‌లో
మే 5న ఢిల్లీ కేపిటల్స్‌తో హైదరాబాద్‌లో
మే 10న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్‌లో
మే 18న లక్నో సూపర్ జెయింట్స్‌తో లక్నోలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి