Who Is Angkrish Raghuvanshi: ఐపీఎల్ ద్వారా మరో యువకెరటం వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే రింకూ సింగ్‌ను పరిచయం చేసిన కేకేఆర్.. తాజాగా అంగ్క్రిష్ రఘువంశీని తెరపైకి తీసుకొచ్చింది. వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొల్ కత్తా తరపున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అంగ్క్రిష్ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. తాను ఎుదుర్కొన్న రెండో బంతికే బౌండరీ కొట్టి తన ఉద్దేశాన్ని ఏంటో చెప్పాడు. మార్ష్, నోర్తెజా, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ లాంటి టాప్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. సునీల్ నరైన్‌తో కలిసి 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. ఇతడు కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేస్తుకున్నాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఈ 18 ఏళ్ల ప్లేయర్ ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో 27 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇతడు కేకేఆర్ తరపున ఆడటంలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు.
అసలు ఎక్కడి నుండి వచ్చాడు?
రఘువంశీ క్రికెట్‌ను ఆడేందుకు 11 సంవత్సరాల వయస్సులో గుర్గావ్ నుండి ముంబైకి వెళ్లాడు. 2022 U-19 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మెగా టోర్నీలో 278 పరుగులను చేశాడు. యష్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. గతేడాది లిస్ట్-ఏ, దేశవాళీ టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. సీకే నాయుడు ట్రోఫీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అతడు కేవలం 9 మ్యాచ్‌లలో 765 పరుగులు సాధించాడు. 2024 వేలంలో అతనిని కేకేఆర్ బేస్ ధరకు కొనుగోలు చేసింది.
Also Read: IPL 2024: KKR దెబ్బకు పాయింట్ల పట్టికలో పెను మార్పులు.. అట్టడుగుకు ముంబై.. టాప్ ఫ్లేస్ ఎవరిదంటే?
ఢిల్లీపై కేకేఆర్ ఘన విజయం
వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏడు వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్ నరైన్ 85 పరుగులతో రాణించాడు. రఘవంసశీ, రస్సెల్, రింకూ సింగ్ మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్య ఛేదనను ప్రారంభించిన ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ 55, స్టాబ్స్ 54 పరుగుల చేశారు. కేకేఆర్ బౌలర్లలో ఆరోరో, వరుణ్ చెరో మూడు వికెట్లు తీశారు.
Also read: KKR vs DC Live Score: వైజాగ్ లో కేకేఆర్ పరుగుల సునామీ.. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అత్యధిక స్కోరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి