Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరుతో ఇఛ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతోపాటు జో రూట్, హ్యారీ బ్రూక్ , ట్రావిస్ హెడ్ పోటీ పడ్డారు. చివరకు భారత పేసర్ మేటి ఆటగాడిగా ఎంపిక అయ్యాడు. బుమ్రా ఐసీసీ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2024 టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గానూ నిలిచాడు. గత ఏడాది టెస్టుల్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. 13 మ్యాచుల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 2024లో సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
ఈ క్రమంలోనే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచిన తొలి భారత పేసర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఓవరాల్ గా ఐదో భారత క్రికెటర్ గా నిలిచాడు. అంతకుముందు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
Also Read: Also Read: Old Tax Regime vs New Tax Regime: పాత, కొత్త పన్ను విధానం.. రెండింట్లో ఏది బెటర్
An unforgettable year for the irrepressible Jasprit Bumrah, who claims the Sir Garfield Sobers Trophy for 2024 ICC Men's Cricketer of the Year 🙌 pic.twitter.com/zxfRwuJeRy
— ICC (@ICC) January 28, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి