IIT Baba On Ind vs Pak: ఐఐటీ బాబా జ్యోతిష్యం సంచలనం.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఓడుతుంది

IIT Baba Shocking Prediction On India Pakistan Match In Champions Trophy: క్రికెట్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ఓ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోతుందని ప్రకటించడంతో అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 21, 2025, 10:29 PM IST
IIT Baba On Ind vs Pak: ఐఐటీ బాబా జ్యోతిష్యం సంచలనం.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఓడుతుంది

 Champions Trophy IND Vs PAK Match: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌. దాయాదుల మధ్య జరిగే పోరుపై క్రికెట్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి జోరుగా నడుస్తోంది. భారత్‌, పాకిస్థాన్‌ ఎప్పుడూ తలపడ్డా అదొక యుద్ధం మాదిరి.. ప్రపంచకప్‌ స్థాయిలో అంచనాలు ఉంటాయి. అలాంటి మ్యాచ్‌పై ఒకరు చెప్పిన జ్యోతిష్యం సంచలనం రేపుతోంది. భారత్‌కు ప్రతికూల ఫలితం ఉంటుందని అతడు చెప్పడంతో నెటిజన్లు, భారత క్రికెట్‌ అభిమానులు అతడిపై విరుచుకుపడుతున్నారు. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: Ind vs Ban Highlights: 'ఛాంపియన్స్‌ ట్రోఫీ'లో బంగ్లాదేశ్‌ బోల్తా.. శుభమన్‌ గిల్‌ మాయతో భారత్‌ విజయం

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భారత జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ టోర్నీలో ఈనెల 23వ తేదీన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. దుబాయ్‌ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌పై గెలిచిన ఉత్సాహంతో భారత్‌ ఉండగా.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చెందిన పాకిస్థాన్‌ రెండూ ఢీ కొట్టనున్నాయి. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌పై బెట్టింగ్‌లు.. జ్యోతిష్యాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రసిద్ధి పొందిన ఐఐటీ బాబా ఈ మ్యాచ్‌ ఫలితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన షమీ, హృదయ్‌.. భారత లక్ష్యం 229

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోతుందని ఐఐటీ బాబా చెప్పాడు. దీంతో అతడిపై నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు విరుచుకుపడ్డారు. 'ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోతుంది. నేను ముందే చెబుతున్నా. విరాట్‌ కోహ్లీతోపాటు భారత ఆటగాళ్లు ఎవరూ ఎంత కష్టపడినా కూడా ఈ ఫలితాన్ని మార్చలేరు' అని ఐఐటీ బాబా స్పష్టం చేశారు. 'దేవుడి కన్నా ఎవరూ గొప్ప కాదు. చూద్దాం ఏం జరుగుతుందో' అని ఐఐటీ బాబా చెప్పాడు. అతడిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి షాకయ్యాడు. మీరేమంటారు? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నెటిజన్లను అడగడంతో అందరూ ఐఐటీ బాబాపై మండిపడుతున్నారు. 

ఐఐటీ బాబా ఎవరు?
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభామేళ ద్వారా వెలుగులోకి వచ్చిన బాబానే ఐఐటీ బాబా. అతడి పేరు అబే సింగ్‌. ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. మహాకుంభ మేళా సందర్భంగా సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను ఐఐటీ బాబాగా ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళలో ఐఐటీ బాబా విశేష ప్రాచుర్యం పొందాడు. సోషల్‌ మీడియాలో అతడి వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాక్‌లు ఐదుసార్లు తలపడగా ప్రత్యర్థి మూడు సార్లు విజయం సాధించగా.. భారత్‌ రెండు సార్లు గెలిచింది. ఇక వన్డేల్లో చూస్తే మొత్తం 175 మ్యాచ్‌లు ఆడగా.. భారత్‌ 57 సార్లు విజయం సాధించగా.. అత్యధికంగా పాకిస్థాన్‌ నెగ్గింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Trending News