Sachin Tendulkar: క్రికెట్‌ గాడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు.. సచిన్‌ ఎందుకంత స్పెషలో తెలుసా?

 Sachin Tendulkar: టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కు బిసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్ ను ఈ అవార్డుతో సత్కరించనుంది. సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు సచిన్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.   

Written by - Bhoomi | Last Updated : Jan 31, 2025, 07:33 PM IST
Sachin Tendulkar: క్రికెట్‌ గాడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు.. సచిన్‌ ఎందుకంత స్పెషలో తెలుసా?

 Sachin Tendulkar: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే బీసీసీఐ త్వరలో వార్షిక అవార్డుల వేడుకను నిర్వహించబోతోంది. ఈ అవార్డు ఫంక్షన్ ఫిబ్రవరి 1వ తేదీ శనివారం నిర్వహించనుంది. దీనికి ముందు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను సికె నాయుడు అవార్డుతో సత్కరించవచ్చు.సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు సచిన్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత క్రికెటర్ దిగ్గజ ఆటగాడు అందించిన సేవలు అమోఘమని పేర్కొన్నాయి. ఈ పురస్కారాన్ని స్వీకరించనున్న 31వ అటగాడు సచిన్ టెండూల్కర్ కావడం గమనార్హం.  గతంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, లెంజడరీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ తో పాటు పలువురు ఈ అవార్డును అందుకున్నారు. 1994లో భారత జట్టు తొలి కెప్టెన్ కర్నల్ సీకే నాయుడు గౌరవార్థం ఈ అవార్డును బీసీసీఐ తీసుకువచ్చింది. సీకే నాయుడు 1916 నుంచి 1963 వరకు సుదీర్ఘంగా 47సంవత్సరాల పాటు ఫస్ట్ క్లాసులో కొనసాగారు. ఇది ప్రపంచ రికార్డు. 

సచిన్ గతంలో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నాడు. ఇది కాకుండా, అతను అర్జున్ అవార్డు, ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్,  మహారాష్ట్ర భూషణ్ అవార్డులతో కూడా సత్కరించబడ్డాడు. 2012లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో సత్కరించారు. ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్‌కు పలు క్రీడా అవార్డులను అందించాయి.సచిన్ భారత్ తరఫున 1 టీ20, 200 టెస్టులు,  463 వన్డేలు ఆడాడు. మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో టెస్టుల్లో 15921 పరుగులు, వన్డేల్లో 18426 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన రికార్డు కూడా సచిన్‌కు ఉంది. అందుకే అతని కోసం బీసీసీఐ పెద్ద అడుగు వేసింది.

Also Read: Economic Survey: వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే మీ పని మటాష్.. ఫ్రూఫ్ ఇదిగో   

సికె నాయుడు అవార్డు గురించి మాట్లాడుతే.. సచిన్ కంటే ముందు, భారత క్రికెట్‌లోని చాలా మంది దిగ్గజాలను ఈ అవార్డుతో సత్కరించారు.  చివరిసారిగా 2023లో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి ఈ అవార్డు లభించింది. అతని కంటే ముందు లాలా అమర్‌నాథ్, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే, కెఎన్ ప్రభు, హేము అధికారి, సుభాష్ గుప్తే, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా ఈ అవార్డును అందుకున్నారు.

సునీల్ గవాస్కర్, బిబి నింబాల్కర్, చందు బోర్డే, బిషన్ సింగ్ బేడి, ఎ వెంకటరాఘవన్, ఇఎస్ ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, మొహిందర్ అమర్‌నాథ్, సలీం దురానీ, అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, సయ్యద్ కిర్మాణి, రాజిందర్ గోయల్, కె పద్మాకర్ శివల్‌కర్,  ఫరూక్ ఇంజనీర్ కూడా సికె నాయుడు అవార్డుతో సత్కరించారు.

Also Read: Delhi Assembly Elections 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. ఒకేసారి 8మంది ఆప్ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News