BCCI New Rules Explainer: వామ్మో.. ఇవేం రూల్స్ బాబోయ్.. ఏదో కార్పొరేట్ కాలేజీకి చెందిన హాస్టల్‌లో విధించినట్టు షరతులు పెట్టారు కదా. ఇలా అయితే ఆటగాళ్లకు వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉంటుంది? ఇది క్రికెటర్ల పర్శనల్ లైఫ్‌ను పాడు చేయడమే అవుతుంది. వరుస ఫ్లాపులతో అత్యంత దారుణంగా ఆడుతున్న టీమిండియా ప్లేయర్లను రైట్ ట్రాక్‌లోకి పెట్టే లక్ష్యంతో బీసీసీఐ తీసుకొచ్చిన పది నిబంధనల గురించి జరగుతున్న చర్చ ఇది! మరోవైపు ఈ నిబంధనలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకొందరేమో ఇందులో కొన్ని రూల్స్ కఠినంగా ఉన్నాయని.. అలా ఉంటే ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడలేరని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ బీసీసీఐ తీసుకొచ్చిన రూల్స్ ఏంటి? ఇరు వర్గాల వాదనలో ఎవరిది కరెక్ట్?
దేశవాళీ మ్యాచ్‌లు ఆడతారా?
ముందుగా బీసీసీఐ ప్రవేశపెట్టిన రూల్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడం తప్పనిసరి చేయడం. జాతీయ జట్టులో ఎంపికకు దేశవాళీ క్రికెట్ ఆడడం తప్పనిసరి అని బీసీసీఐ కుండబద్దలు కొట్టింది. ఈ రూల్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుందని చెబుతోంది. ఇది కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లకు పెద్ద షాక్‌గానే చెప్పాలి. కారణాలు ఏవో తెలియదు కానీ ఈ ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తర్వాత డొమెస్టిక్ క్రికెట్ వైపు కన్నెత్తి చూడలేదు.
ఐదేళ్లుగా వీరి ఫ్లాప్ షోకు అదే కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ రూల్‌ని సమర్థించేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక బీసీసీఐ తీసుకొచ్చిన రెండో షరుతు కుటుంబాలకు సంబంధించినది. ఫ్యామిలీ మెంబర్స్‌తో ప్రత్యేక ప్రయాణాలపై బీసీసీఐ నిషేధం విధించింది. ఇకపై ఆటగాళ్లందరూ జట్టుతో కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విడిగా ప్రయాణాలు చేయడంపై ఆంక్షలు విధించారు. ఈ రూల్‌లో లాజిక్ లేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. గతంలో ఇలాంటి రూల్స్ లేకుండా టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఘటనలను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
Also Read: Karun Nair: ఇదేం కొట్టుడు సామీ... ఇలా కూడా ఆడతారా? బీసీసీఐ పెద్దలూ.. మా వాడి తడాఖా చూస్తున్నారా?
ఎండొర్స్‌మెంట్లు బంద్
అటు వ్యక్తిగత సిబ్బందిని తమతో పాటు తీసుకెళ్లడాన్ని కూడా బీసీసీఐ నిషేధించింది.టూర్ లేదా మ్యాచ్‌లకు వ్యక్తిగత సిబ్బంది.. అంటే హెయిర్‌స్టైలిస్టులు లాంటివారిని ఇకపై తీసుకెళ్లడం కుదరదు. ఇక మరో షరతు ఏంటంటే ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్లకు కచ్చితంగా హాజరవ్వాలి. నిజానికి ఈ రూల్ ఎప్పటి నుంచో ఉంది. అటు టూర్ల సమయంలో వ్యాపార ప్రకటనల షూటింగ్‌లకు హాజరు కావడాన్ని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందుకే ఇకపై అలా చేయకుండా ఉండేలా మరో రూల్ పెట్టింది. ఇది కోహ్లీ, రోహిత్‌కి గట్టి దెబ్బగానే చెప్పవచ్చు.
ఎందుకంటే టూర్ సమయంలో వ్యక్తిగత ప్రకటనలు, ఎండొర్స్‌మెంట్లు చేయకూడదు. టూర్ ముగిసే వరకు ఆటగాళ్లంతా జట్టుతో పాటే ఉండాలని బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. అయితే ఇక్కడే ఓ విషయాన్ని ఫ్యాన్స్ పాయింట్ అవుట్ చేస్తున్నారు. టూర్ మధ్యలో ఎండొర్స్‌మెంట్లు ఇవ్వకూడదని చెప్పడం వరకు బాగానే ఉంది కానీ మరో షరతు ఈ రూల్‌ను Contradict చేసేలా ఉందన్న వాదన వినిపిస్తోంది. బోర్డు నిర్వహించే కార్యక్రమాలు, ప్రమోషనల్ షూట్స్, ఫంక్షన్లకు ఆటగాళ్లు హాజరుకావాలని బీసీసీఐ మరో రూల్ పెట్టడం వెనుక లాజిక్ ఏంటో అంతుబట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన రూల్స్ గురించి పెద్దగా చర్చ జరగడంలేదు.
నిజానికి క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఆటగాళ్లను క్రమశిక్షణతోనే ఉంచుతుంది కానీ ఇంత కఠినంగా రూల్స్ అయితే పెట్టలేదు. వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యుల విషయంలో వారికి సడలింపు ఉంటుంది. అటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇస్తుంది. ఈ రెండు కూడా మంచి జట్లేనని పలువురు ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. ఇక ఈ రూల్స్‌ను పాటించకపోతే బీసీసీఐ భారీ శిక్షలే విధించనుంది. రూల్ పాటించని ఆటగాడిని ఐపీఎల్‌లో ఆడకుండా చేస్తారట. BCCI నిర్వహించే టోర్నమెంట్‌లలో పాల్గొనకుండా బ్యాన్ చేస్తారట. ఒకవేళ ఏదైనా రూల్ నుంచి మినహాయింపు కావాలంటే సెలక్షన్ కమిటీ ఛైర్మన్, హెడ్ కోచ్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ చెబుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.