Vastu Tips For Pooja Room: పూజ గది అనేది కేవలం ఒక గది మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికతకు, దైవ భక్తికి, మనసుకు శాంతిని ఇచ్చే ఒక పవిత్ర స్థలం. ఈ పూజ గది ప్రతిఒకరి ఇంట్లో ఎంతో ముఖ్యమైనది. అంతేకాకుండా పూజ చేయడం వల్ల సానుకూల శక్తి కలుగుతుంది. పూజ గదిలో ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఎగటివ్ ఎనర్జీ తొలుగుతుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అంతేకాకుండా పూజ గది కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి, వారి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన విలువలను గుర్తు చేస్తుంది.
ప్రస్తుత కాలంలో పూజ గదులను ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. దీని బోలెడు కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లలో పూర్తి స్థాయి పూజ గదికి స్థలం కేటాయించడం కష్టంగా మారింది. అంతేకాకుండా ఇంటి అలంకరణలో భాగంగా పూజ గదిని కూడా ఒక అందమైన కోణంలో చూడాలనే ఆలోచన పెరిగింది. చాలా మంది బెడ్‌రూమ్‌లో చిన్న పూజ మందిరం ఏర్పాటు చేసుకుంటారు. మరి కొందరూ చదువుకునేటప్పుడు దైవ స్మరణ చేసుకోవడానికి స్టడీ రూమ్‌లో పూజ మందిరం ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి ప్రదేశాల్లో ఉంచడం పెద్ద తప్పుగా భావిస్తారు.
పూజ గదిని ఇంటిలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఏ దిశగా ఉంచాలి? ఎలాంటి లాభాలు కలుగుతాయి? అనే విషయాలను పూర్తిగా వివిరిస్తారు. ఇప్పుడు ఏ దిశలో పూజ గదిని పెట్టుకోవడం మంచిది అనేది తెలుసుకుందాం.
ఈశాన్య దిశ:
పూజ గదిని ఈశాన్య దిశ ఉంచడం వల్ల దేవతలు ఆ ఇంట్లో నివాసం ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ దిశలో పూజ గది ఉంటే ఎల్లప్పుడు ఇంట్లో శాంతి, సమృద్ధి, ఆరోగ్యం వృద్ధి అవుతాయని చెబుతున్నారు. కాబట్టి పూజ గదిని ఈశాన్యం ఉంచడానికి ప్రయత్నించండి.
తూర్పు దిశ:
సాధారణంగా సూర్యోదయం తూర్పు దిశ నుంచి ఏర్పడుతుందని కాబట్టి చాలా మంది ఈ దిశలో పూజగదిని ఏర్పటు చేసుకుంటారు. ఈ వైపు పూజ గది ఉండటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మంచి లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర దిశ:
ఉత్తర దిశ కూడా పూజ గదికి అనుకూలమైనది. ఈ దిశలో పూజ గదిలను కట్టడం వల్ల ధన లాభాం, ప్రశాంతత, కుటుంబంలో శుభకార్యలు జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా కూడా పూజగదులకు ఎంతో మంచి ఎంపిక.
Also Read: 6 Zodiac Signs Biggest Liars: ఈ 6 రాశులవారితో జాగ్రత్త..వీరు అబద్ధాలు చెప్పడంలో దిట్ట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.