These Peoples will get Happiness and Prosperity due to Mercury Mahadasha 2023: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తుంటారు. మేధస్సు, తార్కిక సామర్థ్యం మరియు నైపుణ్యానికి కారకంగా బుధుడిని పరిగణిస్తారు. బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 25 రోజులు పడుతుంది. బుధ రాశి మార్పు కొన్ని రాశుల ప్రజలకు మంచి ఫలాలను ఇస్తుంది. ఇక బుధుని మహాదశ శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి యొక్క జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే.. అది వ్యక్తికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.
జ్యోతిషశాస్త్రంలో బుధుడి మహాదశను శుభప్రదంగా భావిస్తారు. బుధుడి మహాదశ 17 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దీని ప్రభావం ఓ వ్యక్తి యొక్క మేధస్సు, సృజనాత్మకతపై స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే.. 17 సంవత్సరాలు సుఖంగా ఉంటాడు. బుధ గ్రహం మహాదశ సమయంలో ఒక వ్యక్తి జీవితాన్ని సరదాగా గడుపుతాడు. వ్యక్తి జాతకంలో బుధ గ్రహం మహాదశ బలహీనంగా ఉన్నప్పుడు.. ఒక వ్యక్తి మేధస్సుపై చెడు ప్రభావం ఉంటుంది. అంతేకాదు సదరు వ్యక్తి లక్ష్యాన్ని సాధించలేడు.
బుధుని మహాదశ సమయంలో బుధుని అంతర్దశ ఉన్నప్పుడు.. ఒక వ్యక్తి మతపరమైన ధోరణులు అభివృద్ధి చెందుతాయి. అన్ని పనులు మంచి మనస్సుతో చేస్తారు. అంతేకాదు బుధుని అనుగ్రహం వల్ల ధనవంతులు అవుతారు. డబ్బుకు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వ్యక్తి జ్ఞానం మరియు కళ మొదలైన వాటి ద్వారా సమాజంలో గౌరవం పొందుతాడు.
బుధ మహాదశలో సూర్యుని అంతర్దశ ఉంటే ఆ సమయం వ్యక్తికి అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు ఉప కాలంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. వ్యక్తి యొక్క మనస్సు సృజనాత్మక పనులలో నిమగ్నమవ్వడం ప్రారంభిస్తుంది. కుటుంబంతో మాధుర్యం పెరుగుతుంది. శుక్రుని అంతర్దశ వ్యక్తికి చాలా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.