Shani Dev Effects: 30 ఏళ్ల తర్వాత శని అరుదైన ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి డబుల్‌ జాక్‌పాట్.. ఊహించని లగ్జరీ లైఫ్‌!

Shani Dev Effects: ఫిబ్రవరి 28న శని గ్రహం మీన రాశిలోకి వెళ్లేందుకు కదలికలు జరపబోతోంది. దీని వల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 25, 2025, 02:50 PM IST
Shani Dev Effects: 30 ఏళ్ల తర్వాత శని అరుదైన ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి డబుల్‌ జాక్‌పాట్.. ఊహించని లగ్జరీ లైఫ్‌!

Shani Dev Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో శని గ్రహం ఒకటి.. ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత మీన రాశిలోకి శని గ్రహం సంచారం చేయబోతోంది. ఈ శని సంచారం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. శని కర్మలను బట్టి ఫలాలు అందిస్తాడు. కాబట్టి జీవితంలో ఎలాంటి పనులు చేస్తారో.. దీని బట్టి శనీశ్వరుడు ప్రత్యేకమైన ఫలాలను అందిస్తాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న శని కదలికలు జరుపుతూ.. మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారిపై శని శక్తివంతమైన ఎఫెక్ట్ పడి అద్భుతమైన లాభాలు పొందుతారు. శని అనుగ్రహంతో భవిష్యత్‌లో అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులవారు ఎవరో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మిథున రాశి:
శని గ్రహం జరిపే కదలికల కారణంగా మిథున రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన రాణించగలుగుతారు. దీంతో పాటు ఒత్తిడి నుంచి కూడా విముక్తి కలుగుతాయి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే ఎంతో సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు భాగస్వామ్య జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. కెరీర్‌కి సంబంధించిన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని ఎఫెక్ట్‌ వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పని తగ్గి.. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎలాంటి పనులు చేసిన బోలెడు ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో పురోగతి లభించి.. కొత్త ఆదాయ మార్గాలు కూడా కలుగుతాయి. అలాగే ఆదాయం కూడా అనుకున్న దాని కంటే ఎక్కువగా పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. పిల్లల నుంచి వస్తున్న కొన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి డబ్బు సంబంధింత సమస్యలు కూడా తొలగిపోతాయి. 

తుల రాశి:
శని గ్రహం ఎఫెక్ట్‌ వల్ల తుల రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా పెరిగి.. అన్ని రంగాల్లో విజయాలు సాధించే శక్తిని పొందుతారు. పనికి దగ్గ ఫలితాలు కూడా లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రదోన్నతులు కూడా లభించి, జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ముఖ్యంగా పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తుల సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. ఇక ఎప్పటి నుంచో పోటీ పరీక్షలు రాస్తున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారుతుంది. దీంతో వీరు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News