Sun Transit Effect: సూర్యుడి సింహరాశి ప్రవేశం కుంభరాశిపై తీవ్రంగానే పడనుంది. కుంభరాశి జాతకులపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రహాల చలనం, పరివర్తనం వివిధ రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. సూర్యుడు కూడా సింహరాశిలో ఏడాదికోసారి ప్రవేశిస్తాడు. ఈసారి ఆగస్టు 17వ తేదీన సూర్యుడి సింహరాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడిని స్వాగతించేందుకు ఆ రాశిలో ఇప్పటికే బుధుడు ఆశీనుడై ఉన్నాడు. రెండు గ్రహాల కలయికతో మరింత బలోపేతం కానుంది. సింహరాశిలో సూర్యుడి నక్షత్రం ఉత్తర ఫాల్గుణం కావడంతో మరింత ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు వివిధ రాశుల్లో ప్రవేశించినప్పుడు ఆ ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగానూ, మరికొన్ని రాశులపై ప్రతికూలంగానూ ఉంటుంది. అదే విధంగా సూర్యుడి సింహరాశి ప్రవేశం కారణంగా కుంభరాశివారిపై ప్రభావం పడనుంది. సూర్యుడు సింహరాశిలో ఉన్నంతకాలం...కుంభరాశివారికి ఎలా ఉంటుంది, ఏం చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం..
సూర్యుడు ఏ విధంగానైతే అలసట లేకుండా ప్రకాశిస్తూ మొత్తం లోకానికి వెలుగు ప్రసరింపజేస్తాడో..అదే విధంగా సూర్యుడి రాశి మారడం వల్ల కుంభరాశివారు కూడా ఎక్కువ శ్రమించాల్సివస్తుంది. శ్రమించే కొద్దీ ఈ రాశివారికి ఫలితం మాత్రం ఉంటుంది. అందుకే కష్టపడేందుకు మానసికంగా సిద్ధమవాలి. వ్యాపారం చేసేవాళ్లు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ రెండవవారం వరకూ చేసే ప్రతిపనీ ఆలోచించి చేయాలి. అప్పుడే ఆటంకాల్ని తొలగించవచ్చు. ఆటంకాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి.
జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే గ్రహాల స్థితి దాంపత్య జీవితంలో వైషమ్యాలు సృష్టించగలదు. ఇంట్లో మగవారు తమ భార్య, పిల్లల ఆరోగ్యంపై ప్రధానంగా శ్రద్ధ పెట్టాలి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ అవసరం. ప్రత్యేకించి తినే ఆహారం ఆరోగ్యంగా ఉండాలి. లేకుండా కడుపు నొప్పి, తలనొప్పి సమస్యలు వెంటాడవచ్చు.
హఠాత్తుగా ప్రయాణాలు ఎదురుకావచ్చు. సుదూర ప్రయాణాల్లో కష్టాలు ఎదుర్కోవల్సివస్తుంది. ఆర్ధికపరమైన వ్యవహారాల్లో అప్రమత్తత చాలా అవసరం. లేకపోతే అనవసరమైన డబ్బు ఖర్చు ఉంటుంది.
Also read: Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు, శుభముహూర్తం, పూజా వివరాలు మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook