Shani Dev Blessings: శనిదేవుడిని కర్మదేవతగా పరిగణిస్తారు. శని గ్రహం వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఈ గ్రహ కదలికలను ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీని వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇది వ్యక్తుల జీవితాలపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా శని గ్రహం కొన్న రాశులపై అశుభ ప్రభావాన్ని కూడా చూపుతుంది. దీని కారణంగా డబ్బు సమస్యలు రావడమే కాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్టోబర్ 3వ తేదిన శని గ్రహం శతభిష నక్షత్రంలోకి సంచారం చేసింది. ఇది నవంబర్ 15 వరకు అదే నక్షత్రంలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే నవంబర్ 15 తేది వరకు ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో, అత్యంత లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి..
వృషభ రాశి:
శని గ్రహం ప్రత్యక్ష నక్షత్ర సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే వీరికి జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా దూరమవుతాయి. దీంతో పాటు కొత్త అవకాశాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా ఊహించని విజయాలు సాధిస్తారు.
మిథున రాశి:
మిథున రాశివారికి నక్షత్ర సంచారం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి జీవితంలో సంతోషం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబ జీవితంలో వస్తున్న ఎన్నో రకాల సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
కుంభ రాశివారికి కూడా శని నక్షత్ర సంచారం కారణంగా నవంబర్ వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి పూర్తిగా ఖర్చులు కూడా తగ్గుతాయి. దీంతో ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అదృష్టం పెరగడం కారణంగా ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.
మీన రాశి:
మీన రాశివారికి కూడా శని ప్రత్యక్ష సంచారం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు కొత్త పనులు ప్రారంభించడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
శని ప్రాముఖ్యత:
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని సహనం, పట్టుదల, న్యాయానికి సూచిగా పరిగణిస్తారు. ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆటంకాలు తొలగిపోయి.. శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.