Golden Days Starts for These 5 zodiac signs due to Surya Grahan 2023 in April: ఈ సంవత్సరంలో మొదటి 'సూర్య గ్రహణం' ఏప్రిల్ 20న ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం మేష రాశిలో ఏర్పడబోతోంది. ఎందుకంటే సూర్య గ్రహణానికి ముందు ఈ రోజు (ఏప్రిల్ 14) సూర్యుడు సంచరించి మేష రాశిలోకి ప్రవేశించాడు. సూర్య గ్రహణం రోజున సర్వార్థ సిద్ధి యోగా, బుధాదిత్య యోగా, హన్స్ యోగాతో సహా అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగాలు ఏర్పడటం వలన సూర్య గ్రహణం యొక్క అశుభ ప్రభావం తొలగిపోతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. సూర్య గ్రహణం నాడు ఏర్పడే శుభ యోగాలు ఏ రాశుల వారికి ప్రయోజనాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి:
సింహ రాశి వారికి సూర్య గ్రహణం లాభాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు ప్రేమ జీవితంలో సక్సెస్ అవుతారు. ఆదాయం, వ్యాపారం పెరుగుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. మనస్సు మతపరమైన పనులలో నిమగ్నమై ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి సూర్య గ్రహణం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. శారీరక సమస్యలు దూరమవుతాయి. మీరు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
మిథునం:
మిథున రాశి వారికి సూర్య గ్రహణం శుభప్రదం అవుతుంది. ఈ రాశి వారు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, స్థానం పెరుగుతుంది. ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు. గతంలో ఆగిపోయిన ప్రణాళికలు మళ్లీ ప్రారంభమవుతాయి.
ధనుస్సు రాశి:
సూర్య గ్రహణం ధనుస్సు రాశి వారికి పదోన్నతి, జీతభత్యాలు పెరిగే అవకాశాలను కలిగిస్తుంది. జీవితంలో మీ హక్కులు పెరుగుతాయి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్య గ్రహణం రోజున ఏర్పడిన శుభ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో పెద్ద పురోగతి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. ఊహించని డబ్బు కూడా వస్తుంది. మీ వ్యక్తిత్వ ప్రభావం పెరుగుతుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి.
Also Read: Mahindra Thar Price Hike 2023: మహీంద్రా థార్ కొనేవారికి షాక్.. ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన ధర!
Also Read: Gold Price Hike 2023: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర! ఆల్‌టైమ్ హై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.