woman stole chapati roti video goes viral: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యకరంగాను, మరికొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఎమోషన్ తెప్పించేవిగాను ఉంటాయి. ఈ క్రమంలో లోకంలో తల్లిప్రేమ గురించి స్పెషల్గా చెప్పుకొవాల్సిన అవసరం లేదు. నోరు ఉన్న మనుషుల నుంచి మూగజీవాల వరకు కూడా తల్లి ప్రేమకు సంబంధించిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి.
మూగజీవాలు తమ పిల్లల జోలికి ఎవరైన వస్తే, తమకన్న ఎన్నిరెట్లు పెద్దవైన జీవులతోనైన చీల్చి చెండాడేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషనల్ కు గురౌతున్నారు. దీనిలో ఒక మహిళ ఇంట్లో చపాతీలు చేస్తుంది. ఆ ఇంటివారు ఆమెను వంటమనిషిగా పెట్టుకున్నారు. ఆమె కిచెన్ లో చపాతీలు చేస్తుంది.
ఇంతలో ఆమెకు తన పిల్లలు గుర్చొచ్చారో, తన పిల్లలకు రుచికరమైన చపాతీలు తిన్పించాలని అనుకుందో మరేంటో కానీ.. కొన్ని చపాతీలు తీసుకుని ప్రత్యేకంగా కన్పించకుండా తన డ్రెస్ లో దాచిపెట్టుకుంది. ఆ తర్వాత మరల చపాతీలు చేసింది. ఆమె చేసిన పని అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారింది. కొంత మంది సదరు మహిళ తల్లిప్రేమను చూసి ఎమోషనల్ అవుతున్నారు.
Read more: West bengal: భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో జంప్ ఘటన.. వెలుగులోకి వస్తున్న నరాలు తెగే వాస్తవాలు...?..
మరికొందరు ఇలా చోరీ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని కౌంటర్ వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. మనుషులైన, నోరులేని మూగజీవాలైన కూడా తమ పిల్లల కోసం ఏమైన చేస్తారనేదానికి ఇది నిదర్శనమంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. సదరు మహిళ తాపత్రం చూసి మరికొందరు చపాతీలు చోరీ చేయడం తప్పే కానీ.. తన పిల్లల పట్ల ఆమె తాపత్రం చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదని మరికొందరు ఎమోషనల్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.