Married woman making rotis on husband bald head video: సాధారణంగా పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు వస్తునే ఉంటాయి. ఇద్దరు పెరిగిన వాతావరణం, అలవాట్లు కాస్త భిన్నంగా ఉంటాయి. ఒకర్ని మరోకరు అర్థం చేసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. అయితే.. చాలా మంది ఏదైన సమస్యలు ఉంటే తమలో తాము మాట్లాడుకుని గొడవలు బైటకు రాకుండా చూసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం.. ప్రతి చిన్న విషయంను భూతద్దంలో పెట్టి చూసుకుంటారు. అంతే కాకుండా.. ప్రతిదాన్ని పంచాయతీలు పెట్టి గొడవలు పెద్దది చేసుకుంటారు.
కానీ మరికొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. అంతగా డబ్బులు లేకుండా.. ఏదో ఒక బిజినెస్ చేస్తు ఒకరికి మరోకరు అండగా ఉంటారు. తాము చేస్తున్న పనిలోనే ఒకరికి మరోకరు తోడుగా ఉంటారు. అయితే.. కొన్ని సార్లు కొంత మంది మహిళలు తమ భర్తల పట్ల ఫన్నీగా, ఆట పట్టించే విధంగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఒక మహిళ ఆమె భర్త రోటీల బిజినెస్ చేస్తున్నారు.
మరీ ఆమెకు తన భర్త బట్టతల అంటే కోపమో ఏంటో కానీ.. ఆయన్ను ఆటపట్టించాలని ప్లాన్ చేసిందో ఒక వెరైటీ పని చేసింది. సాధారణంగా ఎవరైన చపాతీలను దాని కోసం ప్రత్యేకంగా ఉండే రాళ్ల మీద, ప్లేట్ ల మీద, మార్బుల్ మీద చేస్తుంటారు. కానీ ఈమె మాత్రం చపాతీలు చేసేందుకు తన భర్త.. గుండును సెలక్ట్ చేసుకుంది. అతడికి మరి బట్టతల ఉందో.. లేదా ఎక్కిడి కైన వెళ్లి గుండు చేసుకుని వచ్చాడో కానీ.. మొత్తంగా అతని నున్నటి గుండు మీద ఆ ఇల్లాలు రోటీలు చేస్తు రచ్చ చేసింది.
అతను కూడా.. ఏ మాత్రం విసుక్కొకుండా.. భార్య గుండు మీద చపాతీలు చేస్తు ఇస్తే.. అతను కట్టల పోయి మీద పెనం ఉంచి.. దాని మీద కాలుస్తున్నాడు. మొత్తంగా వీరి అన్యోన్య దాంపత్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు ఫన్నీగా నవ్వుకుంటున్నారు.