woman died while dancing in Vidisha video: ఇటీవల కాలంలో అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన తర్వాత ఏవైన ఆరోగ్య సమస్యలు వస్తుండేవి. కానీ ప్రస్తుతం మాత్రం చిన్న వయస్సులోనే లేనీ పోనీ ఆరోగ్య సమస్యలు కన్పిస్తున్నాయి. చిన్న పిల్లలకు గుండెజబ్బులు, థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. అప్పటి వరకు బాగా ఉన్న వారంతా ఒక్కసారిగా చనిపోతున్నారు.
కొంత మంది డ్యాన్స్ లు చేస్తు కుప్పకూలీ పడిపోతున్నారు. మరికొందరు జిమ్ లు చేస్తు, ఇంకొందరు ఆఫీసు పనులు చేస్తు, మాట్లాడుకుంటూ కుప్పకూలీ పడిపోతున్నారు. మారిపోయిన జీవన శైలీ, ఆహారపు అలవాట్లు కూడా దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే.. తాజాగా.. ఒక యువతి పెళ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్కసారిగా పడిపోయి చనిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి
మధ్యప్రదేశ్ - విదిషలో తన సోదరి పెళ్లి వేడుకల్లో స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి
అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు pic.twitter.com/y2Y5Z74qYJ
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025
మధ్య ప్రదేశ్ లోని విదిషలో షాకింగ్ ఘటనచోటు చేసుకుంది. ఇండోర్ నివాసి పరిణితి జైన్ తన సోదరి పెళ్లిలో ఫుల్ జోష్ గా పాల్గొంది.పెళ్లిలో ప్రత్యేకంగా డ్యాన్స్ ప్రొగ్రామ్ ను ఏర్పాటు చేశారు. దీంతో పరిణితిజైన్ అదిరిపోయే విధంగా స్టెప్పులు వేసింది. ఈ క్రమంలో ఆమె స్టేజీ పైన డ్యాన్స్ చేస్తుంది. అక్కడున్న అతిథులు ఆమె డ్యాన్స్ చూస్తు చప్పట్లతో ఆమెను మరింత ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇంతలో ఏమైందో కానీ ఒక్కసారిగా స్టేజీ మీదనే స్టెప్పులు వేస్తే కుప్పకూలీపడిపోయింది. దీంతో అక్కడున్న బంధువులు యువతిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు యువతిని చూసి గుండెపోటుతో అప్పటికే చనిపోయిందని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లింట జరిగిన విషాదకర ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం తీవ్ర ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter