Viral Video: రెండు లడ్డులు ఒకేసారి కావాలా నాయన.. లవర్స్‌డే వేళ ఇద్దరమ్మాయిలతో యువకుడి రొమాన్స్.. వీడియో వైరల్..

Boy romance with two girls video: రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలతో యువకుడు రోమాన్స్ చేస్తు రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 15, 2025, 07:00 PM IST
  • స్కూల్ బంక్ కొట్టి అమ్మాయిల పాడుపని..
  • తిట్టిపొస్తున్న నెటిజన్లు..
Viral Video: రెండు లడ్డులు ఒకేసారి కావాలా నాయన.. లవర్స్‌డే వేళ  ఇద్దరమ్మాయిలతో యువకుడి రొమాన్స్.. వీడియో వైరల్..

Teen boy kisses and hugs two girls on road video: కొంత మంది యువత ఇటీవల మరీ బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ప్రేమకు ఉన్న పవిత్రమైన గొప్పతనాన్ని బజారును పడేస్తున్నారు.  తమఅవసరాల కోసం యువతీ,యువకులు ప్రేమను పావుగా వాడుకుంటున్నారు.  మరికొందరు ఫ్రెండ్స్ అని చెప్పుకుని ఆ తర్వాత ప్రేమలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఆ తర్వాత తమ అవసరాలు తీరిపోయాక బ్రేకప్ చేప్పేసుకుంటున్నారు.

మరొవైపు ఇంకొంత మంది స్కూల్ లకు వెళ్లి చక్కగా చదువుకొవాల్సిన వయసులోనే లవర్ లను మెంటైన్ చేస్తు నీచంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి స్కూల్ లకు వెళ్లమంటే.. అక్కడికి వెళ్లకుండా లవర్ లతొ పార్క్ లకు, రోడ్ల మీద, సినిమాలకు వెళ్తు అడ్డమైన పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇద్దరమ్మాయిలు, ఒక యువకుడితో రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గామారింది.

 

దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా దీనిలో ఇద్దరమ్మాయిలు, యువకుడు స్కూల్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. మరీ వాళ్లు స్యూల్ బంక్ కొట్టి వచ్చినట్లు ఉన్నారు. అంతే కాకుండా.. వారిద్దరు కూడా యువకుడితో రోడ్ల మీదనే రొమాన్స్ చేసుకున్నారు. కిస్ లు పెట్టుకుంటూ, హగ్ లు చేసుకుంటు ఎవరు ఏమనుకుంటే మాకేంటనీ బరితెగించి ప్రవర్తించారు.

అతగాడు మాత్రం.. ఇద్దరమ్మాయిల్ని ఒకేసారి లైన్ లో పెట్టి ఒకరి తర్వాత మరోకర్ని కిస్ లు, హగ్ లు ఇస్తు వారిని మన్మథుడిలా తన కౌగిలీలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొత్తంగా వీరి యవ్వారంను అక్కడ మిద్దేమీద నుంచి కొంతమంది వీడియో తీశారు.

Read more: Elephants Attack video: దేవుని ఉత్సవాలలో ఏనుగుల బీభత్సం.. జనాలను తొండంతో ఎత్తిపడేసిన గజరాజులు.. వీడియో వైరల్..

అంతేకాకుండా.. వీళ్ల మీద ఒక బకెట్ నిండా నీళ్లు గుమ్మరించి, చెప్పులు విసిరి కొట్టారు. దీంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.దీన్ని చూసిన నెటిజన్ లు రెండు లడ్డులు ఒకేసారి కావాలా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు బుద్దిగా చదువుకొకుండా.. ఇదేంపాడు పని అంటూ వీరిని తిట్టిపోస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News