Earth Viral Video: తలకిందులవుతున్న భూమి, భూ భ్రమణం వీడీయో వైరల్

Earth Viral Video: అనంత విశ్వంలో ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు ఉంటాయి. అన్నింటికీ సాక్ష్యాలు ఉండవు. నమ్మాల్సిందే. అలాంటి అంశమే భూ గ్రహణం. ఇప్పుడు దీనికి కూడా సాక్ష్యం లభించేసింది. భూమి పూర్తిగా తలకిందులైపోతున్న వీడియో ఇది. ఇది గ్రాఫిక్స్ కానే కాదు. కచ్చితమైన రికార్డెడ్ వీడియో. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2025, 07:43 PM IST
Earth Viral Video: తలకిందులవుతున్న భూమి, భూ భ్రమణం వీడీయో వైరల్

Earth Viral Video: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఇప్పటి వరకూ పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే సాక్ష్యం ఏదీ లేదు. కానీ నమ్మాల్సిందే. ఇప్పుడు సాక్ష్యం కూడా వచ్చేసింది. ఓ భారతీయ శాస్త్రవేత్త ఎట్టకేలకు భూ భ్రమణ ప్రక్రియను వీడియోలో బంధించగలిగాడు. ఈ వీడియోలో భూమి 360 డిగ్రీలు ఎలా తిరుగుతుందో, ఎంత వేగంతో తిరుగుతుందో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. భూమి ఇంతలా తలకిందులుగా తిరుగుతున్నా...మనకేం కావట్లేదని ఆశ్చర్యపోతాం. ఆ వీడియో మీ కోసం..

ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డోర్జే అంగ్ చుక్ భూ భ్రమణంపై వీడియో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం పర్వత ప్రాంతమైన లడ్డాఖ్ ఎంచుకున్నారు. నాలుగైదు రోజులు ప్రయత్నించి ఎట్టకేలకు భూ భ్రమణాన్ని అద్భుతంగా వీడియోలో బంధించగలిగారు. ఈ ప్రక్రియలో చాలాసార్లు బ్యాటరీ పనిచేయకపోవడం, టైమర్ పని చేయకపోవడం వంటివి ఎదురయ్యాయి. ఎట్టకేలకు అన్ని అడ్జంకుల్ని అధిగమించి భూ భ్రమణం రికార్డు చేశారు. మొత్తం వీడియోను ఒక నిమిషానికి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడిది వైరల్ అవుతోంది.

వీడియోలో భూ భ్రమణం ఎలా కన్పిస్తుంది

ఇది 24 గంటల టైమ్ ల్యాప్స్ వీడియో, ఇందులో కెమేరాను పర్వత ప్రాంతంలో స్థిరంగా ఉంచి రికార్డ్ చేశారు. అర్ధరాత్రి రికార్డింగ్ ప్రారంభమౌతుంది. ఆకాశంలో నక్షత్రాలు అలానే కన్పిస్తాయి. గంటలు గడిచే కొద్దీ భూమి తన చుట్టూ భ్రమణం చెందే కొద్దీ పర్వతాలు, ఆకాశం అన్నీ పక్కకు తిరిగిపోతుంటాయి. 12 గంటల సమయం తరువాత భూమి మొత్తం తలకిందులై కన్పిస్తుంది. ఆ తరువాత మళ్లీ అవే పర్వతాలు, అదే ఆకాశం తిరిగి యథాస్థానానికి వస్తాయి అంటే 24 గంటలు ముగిసేసరికి ఎక్కడ భ్రమణం ప్రారంభమైందో అక్కడికే ఆగుతుంది. 

ఇది చూసిన తరువాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భూమి ఇంతలా తిరుగుతుందా అని కామెంట్ చేస్తున్నారు. ఇంతలా తిరుగుతున్నా..తలకిందులుగా మారుతున్నా మనకేం కావట్లేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అద్భుతమైన ఈ వీడియో చూసి జనం ఫిదా అవుతున్నారు. 

Also read: Kiran Royal illegal Affairs: జనసేన నేత కిరణ్ రాయల్ భాగోతాలు, త్వరలో సస్పెన్షన్ వేటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News