Robot dogs in Indian army parade in pune video: సాధారణంగా రిపబ్లిక్ డే వేడుకలు, ఇండిపెండెన్స్ డే వేడుకల నేపథ్యంలో పరేడ్ లు నిర్వహిస్తుంటారు. ఆర్మీ, నేవి , ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ సాయుధ దళాలతో ప్రత్యేకంగా పరేడ్ లు నిర్వహింస్తుంటారు. అంతే కాకుండా..ఈ కవాతులో వివిధ విన్యాసాలు కూడా చేస్తుంటారు. బైక్ ల మీద, యుద్ద వాహనాలు, ఆకాశంలో అనేక విన్యాసాలు చేస్తుంటారు.
Indian Army Robo Dog marching 🇮🇳 🐕 #IADN pic.twitter.com/wwNEWXXp0B
— Mukesh Khatri ABS (@mukesh_khatri3) January 10, 2025
ఇదంతా మనం తరచుగా చూస్తుంటాం. అయితే.. ఇటీవల శునకాలకు కూడా బాగా ట్రైనింగ్ లు ఇచ్చి.. ఆర్మీలో ఉపయోగించుకుంటున్నారు. అవి కూడా అచ్చం మనుషుల మాదిరిగా పరేడ్ లలో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో.. ఆర్మీ వేడుకలు జరిగాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే.. తొలిసారిగా ఇక్కడ ఆర్మీ పరేడ్ లలో రోబో శునకాలను ఉపయోగించారు. అవి పరేడ్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహారాష్ట్రలోని పూణెలో ఇటీవల ఆర్మీ పరేడ్ వేడుకలు జరిగాయి. దీనిలో రోబో శునకాలు సందడి చేశాయి. ఈ రోబో శునకాలు.. అచ్చం నిజమైనశునకాల మాదిరిగా.. పరేడ్ లో పాల్గొన్నాయి. అవి తొందరలోనే ఆర్మీలో చేరతున్నాయని అధికారులు వెల్లడించారు. రోబో శునకాలు పరేడ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా రోబోలు బాంబు నిర్వీర్యం చేసే క్రమంలో బాగాట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
Read more: Snake Viral Video: ఇది మాములు ఫైటింగ్ కాదు భయ్యా.. వీడియో చూస్తే భయంతో జడుసుకుంటారు..
మందుపాతరలు, బాంబులు ఉన్న ప్రదేశంలో వీడిని ఉపయోగించుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీటిని పలు విభాగాల్లో బాగా ట్రైనింగ్ ఇచ్చారని.. దీనికోసం ప్రత్యేకంగా చిప్ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ రోబో డాగ్ పరేడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter