Nagpur Man Rides Horse Into Theatre To Watch chhaava movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విక్కి కౌశాల్ లు నటించిన చావా మూవీ ప్రస్తుతం ఒక రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా కొద్ది కాలంలో వంద కోట్ల క్లబ్ లలో చేరిపోయింది. మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర స్వరాజ్య ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుకు శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ చావాకు దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉండగా.. చావా సినిమాను చూసిన వాళ్లంతా థియేటర్లలో ఎమోషన్ కు గురౌతున్నారు. అంతే కాకుండా జై ఛత్రపతి శివాజీ, జై శంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరికొందరు ఔరంగాజేబ్ అన్ని కష్టాలు పెడుతున్న ఆ దారుణాల్ని భరిస్తు.. మన దేశంలో కోసం మొఘల్స్ ముందు తలవంచేదిలేదని చివరి వరకు గట్గిగా ఎదురొడ్డి పోరాడారు.
Chhaava Movie: 'छावा' पाहायला घोड्यावरून संभाजीराजांची वेषभूषा धारण करत आला तरुण...थेट चित्रपट गृहात एन्ट्री, व्हिडिओ पाहा #Chhaava #ChhaavaInCinemas #ChhaavaReview pic.twitter.com/Lihl3RBLXo
— sandip kapde (@SandipKapde) February 14, 2025
అయితే..చావా సినిమాను చూసేందుకు ఒక అభిమాని ఏకంగా శంభాజీ మహారాజ్ లా దుస్తులు, నుదుటిన తిలకం ధరించి నాగ్ పూర్ లోని ఒక థియేటర్ కు వచ్చాడు. అతను.. బ్యాండ్ మేళం, గుర్రం మీద శంభాజీ మహారాజ్ లా కాస్ట్యూమ్ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని స్క్రీన్ ముందర వరకు వచ్చి.. తన అభిమానాన్ని చాటు కున్నాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు కూడా చాలా మంది ఎమోషన్ గా ఫీలవుతున్నారు. మన హిందు ధర్మంకోసం తీసిన ఈసినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter