Lalitha jewellers kiran kumar reddy video: డబ్బులు ఊరికేరావు అనే ఒక్క స్లోగన్ తో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో తన కంటూ పాపులారీటీని తెచ్చుకున్నారు కిరణ్ కుమార్ . సాధారణంగా మార్కెట్ లో ఏ ప్రొడక్ట్ అయిన, కొత్తగా ఏది తీసుకొచ్చిన చాలా మంది సెలబ్రీటీలను తీసుకొచ్చి మరీ వారితో మార్కెటింగ్ చేయించుకుంటారు. తమ కంపెనీకి బ్రాండ్ అంబాసీడర్ గా ఉండాలని అగ్రిమెంట్ చేసుకుంటారు.
ఈ క్రమంలో లలిత జువెల్లర్స్ అధినేత కిరణ్ కుమార్ మాత్రం.. తమ బిజినెస్ కు తానే.. ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఒక కొత్త స్లోగాన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. డబ్బులు ఊరికేరావు అంటూ.. దేశంలో అందరి నజర్ ను తనవైపు తిప్పుకున్నారు. అయితే.. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక లలితా జువెల్లర్స్ గోల్డ్ షాపులు ఉన్నాయి. ఎప్పటి కప్పుడు కస్టమర్లకు అనుకూలంగా గోల్డ్ అందిస్తు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.
లైఫ్ లో ఎంత సంపాదించాలి
ఇంత... గుండు తుడవడానికి కూడా ఒకడిని పెట్టుకునేంత... pic.twitter.com/YjhKV4oTZg— Nani (@Ravanaroy) February 10, 2025
అయితే.. ఆయన ఎప్పుడు కూడా.. చుట్టుపక్కల గోల్డ్ షాపుల్లోకి వెళ్లాలని, అక్కడ, తమ వద్ద గోల్డ్ ధరలను చూసుకున్న తర్వాత బంగారం కొనాలని డబ్బులు ఊరికేరావని చెప్తుంటారు. కొన్ని బంగారు షాపుల వారు ఇచ్చే ఆఫర్ లను, ఫ్రీ గిప్ట్ లను చూసి మోసపొవద్దని చెప్తుంటారు. ఈ క్రమంలో తాజాగా.. కిరణ్ కుమార్ కు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
దీనిలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు తలపై జుట్టు లేకుండా నున్నగా ఉంటారని విషయం తెలిసిందే. ఆయన తలపై చెమట వచ్చినట్లుంది. దీంతో ఆయన వెనుకాల ఉన్న ఒక వ్యక్తి టవల్ తీసుకుని ఆయన గుండుపై వచ్చిన చెమటను తుడిచారు.
దీంతో అక్కడున్న వారిలో ఎవరో ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడదీ వైరల్గా మారింది. ఇలా భయ్యా.. లైఫ్ అంటే.. గుండు మీద వచ్చిన చెమట తుడించేందుకు కూడా ఒక మనిషిని పెట్టుకున్నాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter