Viral Video: తాబేలును అమాంతం మింగబోయిన మొసలి.. చివరలో ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Crocodile trying to swallow Turtle: ఓ మొసలి తాబేలును అమాంతం మింగబోయింది.. ఇందుకోసం తాబేలును దాని దవడల మధ్య బంధించింది.. కానీ చివరలో ఊహించని విధంగా మొసలికి భంగపాటు తప్పలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 01:50 PM IST
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మొసలి వీడియో
  • తాబేలును మింగేందుకు ప్రయత్నించిన మొసలి
  • చివరకు ఏం జరిగిందో మీరే చూడండి
 Viral Video: తాబేలును అమాంతం మింగబోయిన మొసలి.. చివరలో ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Crocodile trying to swallow Turtle: ఒక మొసలి, ఒక తాబేలు తలపడితే రెండింటిలో ఏది గెలుస్తుంది.. సమాధానం చాలా సింపుల్.. ఎవరైనా మొసలే అని చెబుతారు. మొసలి వైల్డ్ యానిమల్ కావడమే ఇందుకు కారణం. సింహాన్ని ఎలాగైతే అడవికి రారాజుగా పిలుస్తారో.. మొసలిని కింగ్ ఆఫ్ వాటర్‌గా పిలుస్తారు. అయితే ఎంత శక్తివంతమైన జీవికైనా.. తనది కాని రోజున ఎదురుదెబ్బ తగలడమో, లేక చిన్న జీవుల చేతిలో బోల్తా కొట్టడమో ఖాయం. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఓ తాబేలుని అమాంతం మింగేందుకు ప్రయత్నించిన ఓ భారీ మొసలికి భంగపాటు తప్పలేదు. దాని బలమైన రెండు దవడల మధ్య తాబేలును బంధించిన మొసలి.. దాన్ని అమాంతం మింగేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తాబేలు అదృష్టం కొద్ది.. అది మొసలి నోటి నుంచి కింద పడిపోయింది. తాబేలుపై మొసలి పట్టు కోల్పోవడంతో ఒక్కసారిగా కింద పడింది. దీంతో అక్కడి నుంచి చిన్నగా గెంతుతూ మొసలి నుంచి తప్పించుకుంది. తాబేలు అక్కడి నుంచి పారిపోతున్నా.. ఆ భారీ మొసలి అక్కడి నుంచి కదల్లేక ఉండిపోయింది. 

'scienceturkiyeofficial' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటివరకూ 54 వేల పైచిలుకు మంది దీన్ని వీక్షించారు. 2 వేల పైచిలుకు కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. బహుశా మొసలికి ఆ తాబేలు రుచించలేదమో అని ఒకరు కామెంట్ చేయగా... ఆ తాబేలు మూపుపై ఉండే పెంకును నమలాలంటే చాలా శక్తి అవసరమని.. అంత ప్రయాస ఎందుకనే ఉద్దేశంతో మొసలి దాన్ని విడిచిపెట్టి ఉండొచ్చునని మరో నెటిజన్ కామెంట్ చేశారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Science Türkiye (@scienceturkiyeofficial)

Also Read: Flipkart Electronics Sale: ఫ్లిప్​కార్ట్ ఆఫర్​ రూ.14,999కే వన్​ప్లస్ స్మార్ట్​ టీవీ!

Also read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News