Girl falling on sleeping man in metro funny video: సోషల్ మీడియాలో ఇటీవల అనేక వీడియోలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. చాలా మంది ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోదామని ఏవేవో వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా రోటీన్ కు భిన్నంగా తమ పైత్యం చూపించేందుకు కొంత మంది తమ ప్రాణాల్ని సైతం రిస్క్ లో పడేసుకుంటున్నారు. ఎత్తైన జలపాతాలు, సముద్రాలు, బీచ్ల దగ్గరకు వెళ్లి ఇష్టమున్నట్లు రీల్స్ చేస్తున్నారు.
కొందరు జంతువుల దగ్గరకు వెళ్లి రీల్స్ చేస్తు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రో, ఎయిర్ పోర్టు ఇలా జనాలు ఎక్కడ ఉంటే.. అక్కడకు వెళ్లి కొం మంది రీల్స్ , వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. కొంత మంది రీల్స్ పిచ్చిలో అతిగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక యువతి మెట్రోలో చేసిన ఘన కార్యం వార్తలలో నిలిచింది. ఇప్పటి వరకు మెట్రోలో డ్యాన్స్ లు, రొమాన్స్ చేస్తున్న వీడియోలు అనేకం మనం చూశాం.
అయితే.. ఇక్కడ యువతి కాస్త వెరైటీగా థింక్ చేసినట్లుంది. స్పీడ్ గా వచ్చి పడుకున్న యువకుడి ఒడిలో దూకి.. మరోవైపుకు వెళ్లి పోయి అక్కడి నుంచి బైటకు వెళ్లిపోయింది. దీంతో మంచి నిద్రలో ఉన్న సదరు యువకుడు యువతి చేసిన పనికి ఉలిక్కి పడిలేచాడు. అంతే కాకుండా.. అతగాడి ఒడిలో సడెన్ గా కూర్చొవడం వల్ల ప్రైవేటు భాగం చాలా నొప్పిగా అన్పించినట్లుంది. దీంతోఅతగాడు విలవిల్లాడుతూ నిద్రనుంచి లేచాడు.
Read more: Viral Video: మెట్రోలో ఊహించని ఘటన.. నిద్రిస్తున్న యువకుడి ఒడిలో జంప్ చేసిన యువతి.. వీడియో వైరల్..
చుట్టుపక్కల ఉన్న వారు కూడా యువతిని చేసిన పనికి నోరెళ్లబెట్టారు. యువతి మాత్రం రెప్పపాటులో తన పనితాను చేసుకుని అక్కడి నుంచి జారీపోయింది. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. ఇలాంటి పనులు వల్ల అవతలివాళ్లకు చాలా ఇబ్బందులు ఎదురౌతాయని కూడా యువతిపై సెటైర్ లు వేస్తున్నారు.మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.