Chhaava Movie little girl emotional video: ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే చావా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీని చూసేందుకు అభిమానులు భారీగా థియేటర్ లకు వస్తున్నారు . దీనిలో శంభాజీ మహారాజ్ గా .. విక్కి కౌశాల్, యేసుబాయ్ గా రష్మిక మందన్న నటించారు.
The roar in this scene 🔥🔥🔥
Outstanding performance by @vickykaushal09#CHHAVA#Chhaava pic.twitter.com/0rDPmLx3NH— Manish Kumar (@manishkumar_555) February 16, 2025
ఈ సినిమాలో విక్కి కౌశాల్ శంభాజీ మహారాజ్ గా అదరగొట్టారని అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా ఔరంగాజేబు ఎంత టార్చర్ చేసిన కూడా వాళ్ల ముందు తనవంచేది లేదని.. చావా మూవీ ఇచ్చిన ఒక మెస్సెజ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలోని అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చావా మూవీలో ముఖ్యంగా శంభాజీ మహారాజ్ సింహాంతో పోరాటం చేస్తున్న వీడియో, మరోవైపు క్లైమాక్స్ లో ఔరంగాజేబు ఎంత టార్చర్ చేసిన.. నాలుక కత్తిరించిన, గోర్లు కత్తిరించిన కూడా శంభాజీ మహారాజ్ దేశం మాత్రమే ముఖ్యమని, మొఘల్స్ ముందు ఎట్టి పరిస్థితుల్లోను తలవంచేది లేదని కూడా చెప్పిన డైలాగ్ లు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ మూవీలో రష్మిక మందన్న రోల్ ను కూడా నటనను కూడా అభిమానులు ప్రశంసిస్తున్నారు.
This little kid after watching Chhava crying and asking what happened to our Raje ......
I hope soon this movie will be announced tax free should be shown to today's generation about valour courage Sacrifice of our great Dharamveer Mahaveer Chhatrapati Sambhaji Maharaj 🙏 pic.twitter.com/2i9j1DTDg2
— Nandini Idnani 🚩🇮🇳 (@nandiniidnani69) February 16, 2025
ఈ క్రమంలో చావా చూసేందుకు వచ్చిన ఒక చిన్నారి సినిమాతో చూసి చివరకు చాలా ఎమోషల్ అయ్యింది. చావాను ఘోరంగా హింసించి చంపడాన్ని ఆమె చాలా ఎమోషన్గా ఫీలయ్యింది. సినిమా అయిపోయిన కూడా.. ఏడుస్తూ.. చావాను ఘోరంగా హింసించారని తన తల్లిదండ్రులతో ఏడుస్తు మాట్లాడింది.
Read more: Viral Video: ఏంట్రా ఇలా ఉన్నావ్.. కుంభమేళలో మొబైల్ ఫోన్ కి పవిత్ర స్నానం.. వీడియో వైరల్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే.. చావా మూవీ చూసిన దాదాపు అభిమానులంత థియేటర్ లలో ఒక వైపు ఛత్రపతి మహారాజ్ కి జై, జై శంభాజీ మహారాజ్ , జై భవానీ అని నినాదాలు చేస్తు, మరోవైపు ఎమోషన్ కు గురై, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.