Chhaava Movie Emotional seen fan reacts in Gujarat video: మరాఠా యోధుడు, స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కి కౌశాల్, శంభాజీ మహారాజ్ సతీమణిలో..యేసుబాయ్ పాత్రలో రష్మికమందన్న నటించారు.
ముఖ్యంగా విక్కికౌశాల్ నటన చూస్తే.. గూస్ బంప్స్ వచ్చేదిగా ఉందని చెప్పుకొవచ్చు. ఆయన యుద్దకళలు, గుర్రం మీద సవారీ, పోరాటాలు, రాజసం ఉట్టిపడేలా ఠీవీ.. మొదలైనవి ఈ మూవీకి హైలేట్ గా నిలిచాయి. రష్మిక కూడా.. తనదైన స్టైల్ లో శంభాజీ సతీమణి పాత్రలో అద్భుతంగా చేశారు. ముఖ్యంగా స్వరాజ్యం స్థాపనే టార్గెట్ గా ఈ సినిమాలోని డైలాగ్ లు, ఔరంగాజేబు ఎత్తుగడల్ని చావా చిత్తు చేస్తాడు. చివరకు సొంత వాళ్లే చావాను వెన్నుపొటుపొడుస్తారు. చివరకు శంభాజీ మహారాజ్ ను అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి ఔరంగాజేబు ఉరితీసి చంపుతాడు.
#Chhaava ફિલ્મના નાઈટ શોમાં એક વ્યક્તિ આવ્યો અને સ્ક્રિનનો પરદો ફાડી નાખ્યો!
ઘટનાઃ blue chip complex, Bharuch#Bharuch #Chhava #VickyKaushal #multiplex #screen #Damage #bluechipcomplex pic.twitter.com/nVMEnDo8Zz
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) February 17, 2025
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చావా మూవీని చూసేందుకు అభిమానులు భారీగా తరలిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా టెలికాస్ట్ అవుతున్నంత సేపు ఫ్యాన్స్ అంతాఎమోషన్ అవుతున్నారు. థియేటర్ లోనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ లోని భరూచ్ లో మల్టీఫ్లెక్స్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక అభిమాని చావా కోసం థియేటర్ కు వచ్చాడు. క్లైమాక్స్ లో చావాను చిత్ర హింసలు పెట్టే సీన్ నడుస్తొంది.
ఇంతలో అభిమాని స్క్రీన్ దగ్గరకు వెళ్లి గట్టిగా నినాదాలు చేస్తు ఔరంగాజేబ్ కన్పిస్తున్న స్క్రీన్ ను చింపేసి భావొద్వేగానికి గురయ్యాడు. దీంతో అక్కడున్న వారంత షాక్ అయ్యారు. వెంటనే థియేటర్ సిబ్బంది వచ్చి అతడ్ని పోలీసులకు అప్పచెప్పారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో థియేటర్ కు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి