Boycott OYO: మరో వివాదంలో ప్రఖ్యాత ఓయో సంస్థ చిక్కుకుంది. ప్రచారం కోసం పత్రికల్లో వేసిన ఒక వాణిజ్య ప్రకటన వివాదానికి దారి తీసింది. దీంతో ఓయోను బహిష్కరించాలనే డిమాండ్ మొదలైంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఓయోను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ ఓయో అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో వచ్చింది. ఎందుకు వివాదం ఏర్పడింది? బాయ్‌కాట్ ఓయో వెనుకాల ఏం జరుగుతోంది? అనేది తెలుసుకుందాం.
Also Read: Biryani Bill: బిర్యానీకి డబ్బులు అడిగారని ఇనుప రాడ్డుతో కస్టమర్ దాడి.. వీడియో వైరల్
ఏమైంది..?
పత్రికల్లో ఓయో ఒక ప్రకటనను విడుదల చేసింది. 'భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఓయో కూడా అన్ని చోట్ల ఉంటుంది' అని రాసి ఉన్న అడ్వర్టైజ్మెంట్ను ప్రచురించింది. ఇది చూసిన కొందరు ఓయోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడితో ఓయోకు పోలిక ఏంటి? అని నిలదీస్తున్నారు. భగవంతుడిని అవమానించారని విమర్శిస్తూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 'బాయ్‌కాట్ ఓయో' అని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. వెంటనే ఓయో సంస్థ బహిరంగ క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Govt Holiday: విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ప్రతి నెల నాలుగో శనివారం సెలవు
ఓయో సంస్థ నేపథ్యం
ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో దేశవ్యాప్తంగా.. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందుతోంది. కొత్త ప్రాంతాల్లోకి వెళ్లిన సమయంలో ఇబ్బందులు పడకుండా హోటల్స్, గదులు బుక్ చేసుకునేందుకు ఓయోను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 2013లో రితేశ్ అగర్వాల్ ఓయోను ప్రారంభించాడు. ప్రయాణ సమయంలో తక్కువ ధరలో మెరుగైన హోటల్ సేవలు అందించేందుకు ఈ ఓయోను తీసుకువచ్చాడు. ఆన్లైన్ ద్వారా మొబైల్ యాప్, వెబ్సైట్లో హోటల్ గదులు బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆనతికాలంలోనే ప్రాచుర్యం లభించగా.. అలాగే అనేక వివాదాలకు ఓయో కేంద్రంగా నిలిచింది. తాజాగా ప్రచురించిన ప్రకటన (అడ్వర్టైజ్మెంట్) వివాదానికి దారి తీసింది.
#BoycottOYO inn chaman chu...yon
Ka bura samay shuru ho chuka haiAbe itna pta hona chahiye tu hai kya
Ghatiya keedo ke gandgi ke gufaAdvertise Kro usss tarike se jaise tum kaam karate ho apne yanha jaahil pic.twitter.com/zUA4GYzvqC
— PJ Mishra (@PJMishra121110) February 21, 2025
सभी सनातनी आवाज उठाते रहे,
भगवान की तुलना Oyo रुम से करने वाले इस गंदगी को साफ करना है |
ऐसे लोगों के खिलाफ सख्त कार्यवाही कि आवश्यकता है ||#BoycottOYO #JHOPE pic.twitter.com/D5aNvaIBEs
— गहड़वाल साहब (@The_Gaharwar) February 21, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.