Snake Sightings: దేశంలోనే ఐటీకి ప్రఖ్యాతి గాంచిన బెంగళూరు ఇప్పుడు సరికొత్త భయంతో బెంబేలెత్తిపోతుంది. బెంగళూరు నగర ప్రజలు భయభయంతో బతుకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏముంటుందో అని భయాందోళన చెందుతున్నారు. ఎక్కడ ఏ బీరువాలో.. ఎక్కడ ఏ గూటిలో.. ఎక్కడ పాత్రలో పాములు దాక్కుంటాయో తెలియని పరిస్థితి. వేసవి వస్తుండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో చల్లదనం కోసం పాములు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నాయి. దీంతో బెంగళూరులోని పలుచోట్ల పాములు ఇళ్లలోకి.. కార్యాలయాల్లోకి దూరుతున్నాయి. దీంతో ఉద్యోగులు, కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వారం వ్యవధిలో భారీగా పాములను స్నేక్ హ్యాచర్లు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Also Read: Dowry Return: 'బంగారం లాంటి మీ బిడ్డను ఇచ్చాక కట్నం ఎందుకు మామ'.. వరకట్నం తిరిగిచ్చేసిన అల్లుడు
ఫిబ్రవరి నెల ముగియకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కర్ణాటకలో రోజురోజుకు వాతావరణం వేడెక్కుతోంది. పచ్చటి చెట్లతో చల్లటి వాతావరణంతో ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరులో పరిస్థితి మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు తాగునీటి ఎద్దడి మొదలవగా.. మరో కొత్త సమస్య వచ్చి పడింది. పాముల సమస్య బెంగళూరువాసులను బెంబేలెత్తిస్తోంది. అధిక వేడి కారణంగా పుట్టలు.. కలుగుల్లోంచి.. అటవీ ప్రాంతం నుంచి పాములు బయటకు వస్తున్నాయి.
Also Read: Harish Rao: 'డిఫెన్స్..టీ20.. ఎప్పుడు సిక్స్ కొట్టాలో కేసీఆర్‌కు బాగా తెలుసు'
అపార్ట్మెంట్లు.. నివాస గృహాలు, కార్యాలయాల్లోకి పాములు దూసుకొస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే పాముల కేసులు భారీగా పెరిగాయి. తమ ఇళ్లలోకి పాములు వచ్చాయని బెంగళూరు మహానగర సంస్థకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకేరోజు 8 పాములు పట్టుకున్న రోజు కూడా ఉంది. ఇలా రోజురోజుకు పాములు ఇళ్లు, కార్యాలయాల్లోకి దూసుకువస్తుండడంతో కుటుంబాలు, ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
ఒక హెయిర్ సెలూన్‌లోకి పాము ప్రత్యక్షమవడంతో అక్కడి సిబ్బంది భయాందోళన చెందారు. వెంటనే స్నేక్ హ్యాచర్కు సమాచారం అందించగా ఆయన వచ్చి పామును సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలో వదిలివేశారు. మరో చోట ఫ్లాట్‌లోకి దూసుకురావడంతో అందులో నివసించే వారు ఉలిక్కిపడ్డారు. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి పామును పట్టుకున్నారు. ఇలాంటి కేసులు నగరంలో భారీగా నమోదవుతున్నాయి. అధికారికంగా వస్తున్న ఫిర్యాదులు ఇలా ఉండగా.. ఫిర్యాదు అందని కేసులు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. బెంగళూరులో పాములు బెంబేలెత్తించే వీడియోలు వైరల్‌గా మారాయి.
King Cobra found two days ago in a house here in Tirthahalli, Karnataka. This deadliest snake weighed almost 7 kgs and 11.5 ft long! Snake Kiran and team caught this and took it to its natural habitat!#WorldSnakeDay@ParveenKaswan pic.twitter.com/MNWcGroNVU
— Chakravarty Sulibele (@astitvam) July 16, 2020
A 9ft king cobra was found in a house bedroom at Someshwara near Agumbe. An ARRS team led by Ajay Giri safely rescued the snake. An awareness programme was held, and the snake was released back into the wild. @XpressBengaluru pic.twitter.com/n9zMtqkZ7P
— Marx Tejaswi | ಮಾರ್ಕ್ಸ್ ತೇಜಸ್ವಿ (@_marxtejaswi) August 15, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter