Nandamuri Alekhya: తారకరత్న భార్యను గాలికొదిలేసిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్టీఆర్‌.. ఒంటరిగా 'వర్ధంతి'

Nandamuri Taraka Ratna Vardhanthi Wife Alekhya Left Alone: సినీ నటుడు.. రాజకీయాల్లో కొనసాగుతూ హఠాన్మరణం పొందగా.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాజకీయ పార్టీతోపాటు ఆ కుటుంబం పట్టించకోవడం లేదు. అతడి భార్య ఒంటరిగా మారిపోయారు. పిల్లలతో కలిసి తన భర్త వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

1 /6

తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద కుటుంబమైన నందమూరి వంశం నుంచి వచ్చిన నటుడు తారకరత్న. కొన్ని సినిమాలు చేసి సినీ పరిశ్రమలో నిలదొక్కుకులేకపోయిన తారకరత్న అనంతరం కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశంలో చేరారు.

2 /6

టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌ 2023లో చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో తారకత్న పాల్గొని సందడి చేశాడు. అయితే అక్కడ సక్రమంగా ఏర్పాట్లు లేకపోవడంతో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు 18 ఫిబ్రవరి 2023లో కన్నుమూశాడు.

3 /6

తారకరత్న మరణంతో అతడి సతీమణి అలేఖ్య రెడ్డి, అతడి ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తారకరత్న మరణం సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బాలకృష్ణ వంటి వారు 'తారకరత్న కుటుంబానికి అండగా ఉంటాం' అని ప్రకటించారు. కొన్నాళ్లకు అలేఖ్య రెడ్డిని, అతడి పిల్లలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

4 /6

తారకరత్న రెండో వర్ధంతి మంగళవారం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు. పిల్లలతో అలేఖ్య రెడ్డి ఒంటరిగా తన భర్త తారకరత్న వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తారకరత్న లేని లోటును తీర్చలేక ఆవేదనకు గురవుతున్నారు.

5 /6

తారకరత్న మరణించిన సమయంలో అందరూ మేమున్నామని గొప్పలు ప్రకటించిన వారంతా ఇప్పుడు దూరంగా ఉంటుండంతో తారకరత్న భార్య, కుటుంబం ఒంటరిగా మారింది.

6 /6

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, పిల్లలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అండగా ఉన్నారు. అలేఖ్య కుటుంబ బాధ్యతలను విజయసాయి రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌తోపాటు నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఎవరూ పట్టించకోవడం లేదు.