Ramya Krishna career: రమ్యకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రమ్యకృష్ణ చేసిన ఎన్నో క్యారెక్టర్స్ లో.. కొన్ని మాత్రం..తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలలో చిరస్మనీయంగా నిలిచిపోయాయి. అందులో ముఖ్యంగా నీలాంబరి క్యారెక్టర్ ఒకటి. ఈ పాత్రకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు.
దక్షిణ భారత చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ.. గురించి కొత్త రహస్యాన్ని స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ బయటపెట్టారు. రమ్యకృష్ణ కెరియర్ లో ఎప్పటికీ మిగిలిపోయే పాత్ర నీలాంబరి. నరసింహ సినిమాలో ఈ క్యారెక్టర్ అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి అనే నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించారు. ఈ పాత్రలో ఆమె అద్భుతమైన నటన ప్రదర్శించి, ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ పాత్ర ఆమె కెరీర్‌ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ సినిమాలో ఆమె విలనిజం ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించింది.
సినిమా విడుదలైన 26 ఏళ్ల తర్వాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ నీలాంబరి పాత్రకు స్పూర్తి ఎవరు. రమ్యకృష్ణకు మాజీ ముఖ్యమంత్రి కి ఉన్న సంబంధం ఏమిటి అనే కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
అసలు విషయానికి వస్తే..1999లో వచ్చిన 'నరసింహ' (తమిళంలో 'పడయప్ప') చిత్రంలో ఆమె పోషించిన నీలాంబరి పాత్రకు.. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధం ఉందని తెలిపారు. ఎందుకంటే ఆయన నీలాంబరి పాత్ర రాసుకునింది మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని స్ఫూర్తిగా తీసుకొని అని వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఈ పాత్రను డిజైన్ చేసినప్పుడు, జయలలితగారి స్టైల్, ధైర్యం, ఆత్మస్థైర్యం అన్నీ దృష్టిలో ఉంచుకున్నాం. ఆమెలా నీలాంబరి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం. జయలలిత లాగా రమ్యకృష్ణ నే నటించగలడు అని నమ్మాను" అని చెప్పారు.
కాగా ఈ విషయం జయలలితకు కూడా తెలుసు..ఆమె ఈ సినిమాను చూశాక, నీలాంబరి పాత్ర బాగా హైలైట్ అయిందని చెప్పిన విషయం గుర్తుచేసుకున్నారు దర్శకుడు. కాగా నీలాంబరి క్యారెక్టర్ తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ విలన్ పాత్రల్లో కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. కొన్నిచోట్ల నీలాంబరి పాత్ర రజనీకాంత్ పాత్రను మించిపోయిందని కూడా అప్పట్లో చర్చ జరిగింది.
కె.ఎస్.రవికుమార్ ఇటీవల రివీల్ చేసిన ఈ సీక్రెట్ ఇప్పుడు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. నీలాంబరి పాత్రకు జయలలిత స్ఫూర్తిగా ఉండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.