Minister KTR In London: లండన్‌లో బిజీ బిజీగా కేటీఆర్‌..!!

Minister KTR In London: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లండన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రే లండన్‌ చేరుకున్న కేటీఆర్‌.. ఇవాళ ఉదయం నుంచి వరుస మీటింగ్‌లలో పాల్గొంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 04:51 PM IST
  • లండన్‌లో బిజీ బిజీగా మంత్రి కేటీఆర్‌
  • యూకే, దావోస్‌లో 10 రోజుల పర్యటన
  • ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగం
Minister KTR In London: లండన్‌లో బిజీ బిజీగా కేటీఆర్‌..!!

Minister KTR In London: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లండన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రే లండన్‌ చేరుకున్న కేటీఆర్‌.. ఇవాళ ఉదయం నుంచి వరుస మీటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఉదయం పలు కంపెనీల ప్రతినిధులు, యాజమాన్యాలతో బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం నిర్వహించారు. 

యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన అత్యున్నత బిజినెస్‌ బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బ్రిటన్‌కు చెందిన టాప్‌మోస్ట్‌ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్‌తో పాటు వెళ్లిన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి అక్కడి వ్యాపార వేత్తలకు వివరించారు. బ్రిటన్‌ అధికారులు, బిజినెస్‌ మెన్స్‌.. తెలంగాణ అధికారులు, మంత్రి కేటీఆర్‌ వెల్లడించిన ఆంశాలను ఆసక్తిగా విన్నారు. 

హైదరాబాద్‌లోని బ్రిటన్‌ హై కమిషన్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. సమావేశంలో పాల్గొన్న వాళ్ల ఫోటోను కూడా పోస్ట్‌ చేసింది.

Also Read: Funny Viral Video: పెళ్లిపందిరిలో కోపంతో పెళ్లి కుమార్తె ఎంత పని చేసిందో చూడండి!

Also Read: F3 Ticket Price: సినీ అభిమానులకు శుభవార్త.. ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News