Surya Gochar 2023: గ్రహాల కదలిక ప్రభావం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఏప్రిల్ 14, శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో సంచరించబోతున్నాడు. మెర్క్యురీ ఇప్పటికే ఇక్కడ మేషరాశిలో కూర్చుని ఉన్నాడు. త్వరలో వీరిద్దరి కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధాదిత్య యోగం వల్ల ఏ రాశుల వారు విశేష ప్రయోజనాలను పొందబోతున్నారో తెలుసుకుందాం.
సింహరాశి
సూర్యుడు, బుధ గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం సింహ రాశి వారి జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు.
కర్కాటక రాశి
జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య యోగంను శుభప్రదంగా భావిస్తారు. కర్కాటక రాశి వారికి దైర్యం పెరుగుతుంది. ప్రతి పనిలో అన్నదమ్ముల సహకారం ఉంటుంది. . వ్యాపారస్తులు విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. మీ ఆర్థికంగా వృద్ధి చెందుతారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
మేషరాశి
మేష రాశి వారికి బుధాదిత్య యోగం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వివాహం కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
Also Read: Surya Guru Yuti 2023: 12 ఏళ్ల తర్వాత గ్రహాల ప్రత్యేక కూటమి... ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook