Aloe Vera Benefits For Hair Care: చర్మ సంరక్షణకి అలోవెరా జెల్ ప్రభావవంతంగా పని చేస్తుందని అందరికీ తెలిసిందే.. చాలా మంది జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అలోవెరా జెల్‌ను వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు పొడవుగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే జుట్టుకు కలబందను అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా జెల్‌లో జుట్టు కావాల్సిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంట్రుకలు రాలడం, బట్టతల వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా దీనిని చాలా మంది వివిధ రకాల వ్యాధులకు వినియోగిస్తారు. ఇందులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు దాగి ఉంటాయి. చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
కలబందను ఇలా అప్లై చేయండి:
కలబందను నేరుగా జుట్టుపై అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల వేగవంతమవుతుంది. అయితే దీనిని అప్లై చేయడానికి ముందు జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత నేరుగా జుట్టుకు కలబంద లోపలి గుజ్జును అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కలబంద మాస్క్:
సహజమైన కలబంద మాస్క్‌ను జుట్టు వినియోగించడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా అలోవెరా జెల్‌లో తేనె, గుడ్డులోని తెల్లసొన, మెంతి గింజలు, జొజోబా ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేసి జుట్టు పట్టించాల్సి ఉంటుంది. అప్లై చేసిన గంట తర్వాత శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కలబందతో టోనర్:
జుట్టును సంరక్షించుకోవడానికి టోనర్స్‌ను క్రమం తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు. అయితే దాని కోసం కలబందతో తయారు చేసిన సహజమైన టోనర్‌ను వినియోగించడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ½ కప్పు అలోవెరా జెల్‌లో ¼ కప్పు అల్లం రసాన్ని కలపండి. వీటిని బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపి జుట్టుకు స్ప్రే చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
Also read: Mangal Gochar 2023: మంగళ గ్రహ గోచారంతో హోలీ తరువాత ఆ 4 రాశులపై ఊహించని కనకవర్షం
Also read: Mangal Gochar 2023: మంగళ గ్రహ గోచారంతో హోలీ తరువాత ఆ 4 రాశులపై ఊహించని కనకవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook