KCR Allegations on BJP: బీజేపీపై కేసీఆర్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

KCR Allegations on BJP: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌ తో పాటు బీజేపీ అగ్ర నేతలపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 06:19 AM IST
KCR Allegations on BJP: బీజేపీపై కేసీఆర్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

KCR Allegations on BJP: మునుగోడులో ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీజేపిపై చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గిపోతోందన్న భయం, ఆందోళనలతో తీవ్ర అసహనంతో మీడియా ముందుకు వచ్చిన ఫాంహౌజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పాత ముచ్చటనే మళ్లీమళ్లీ చెప్పారని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీకే చెందిన మరో అగ్రనేత బీఎల్ సంతోష్, తదితరులపై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన అర్థరహితమైన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చూపిస్తున్నట్టుగా ఈ వీడియోలో ఉన్నవారితో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని నాతో పాటు మా పార్టీ నాయకులు ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసి ఉన్నాం. అయినప్పటికీ కిరాయికి తెచ్చుకున్న ఆర్టిస్టులతో, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధానికి స్క్రిప్ట్ రాసుకుని, దాన్ని వీడియోగా తీసి, ఇదే నిజం అని జనాన్ని నమ్మించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్రంగా ప్రయత్నించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

 

కేసీఆర్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న అసహనానికి, అభద్రతా భావానికి ఆయన వైఖరే నిదర్శనం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను స్వయంగా తానే ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( KCR ).. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Also Read : KA Paul: కే.ఏ. పాల్ వీడియో చూసి నవ్వుతున్న జనం

Also Read : Bandi Sanjay on munugode Bypolls: వాళ్ల అంతు చూస్తాం.. బండి సంజయ్ హెచ్చరిక

Also Read : KCR Press meet: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ ప్రెస్ మీట్.. గెలుపు ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News