Weight Loss Diet: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే పర్పుల్ క్యాబేజీని ఇలా తీసుకోండి..

Purple Cabbage For Weight Loss: క్యాబేజీలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బాడీ ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఆకు కూరలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 12:02 PM IST
  • బరువు తగ్గాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌
  • బరువు తగ్గడానికి ఆహారంలో పర్పుల్ క్యాబేజీని..
  • క్రమం తప్పకుండా తీసుకోండి.
Weight Loss Diet: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే పర్పుల్ క్యాబేజీని ఇలా తీసుకోండి..

Purple Cabbage For Weight Loss: క్యాబేజీలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బాడీ ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఆకు కూరలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే క్యాబేజీలో ఉండే గుణాలు బరువును కూడా సులభంగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  గ్రీన్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చొ మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు:

బరువు తగ్గడం:
చాలా మంది బరువు పెరుగుతున్నారు. వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి బరువును తగ్గించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశాలుంటాయి. వేగంగా ఆరోగ్యంగా బరువు తగ్గడానికి పర్పుల్ క్యాబేజీని వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువును సులభంగా తగ్గించడమేకాకుండా అన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
 
జీవక్రియ శక్తిని పెంచుతుంది:
ఊదా రంగులో ఉండే క్యాబేజీని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు దూరమవడమేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా పర్పుల్ క్యాబేజీని తినాలని నిపుణులు చెబుతున్నారు.

పుండు సమస్యలు:
పర్పుల్ క్యాబేజీని తినండి అల్సర్ వంటి దీర్ఘకాలీక సమస్యలు కూడా దూరమవుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే వాపును తగ్గించడమేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపులో తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

వాపును తగ్గిస్తాయి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వాపులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పర్పుల్ క్యాబేజీలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంపై మంటలను తగ్గించి వాపులను దూరం చేస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా పర్పుల్ క్యాబేజీని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News