Kidney Disease: కిడ్నీ మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలో పేరుకుపోయిన చెడు వ్యర్థాలను బయటకు పంపేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని కణాలలో ఏర్పడిన యాసిడ్ కిడ్నీ సహాయంతో తగ్గుతుంది. కాబట్టి శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవంగా చెబుతారు. అయితే ప్రస్తుతం చాలా మంది మద్యపానం తీసుకోవడం వల్ల కిడ్నీల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మద్యపానం తీసుకోకపోవడం చాలా మంచిది. అయితే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి.. పలు రకాల ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
కిడ్నీపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి:
కిడ్నీపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు నిపుణులు పదేపదే సూచిస్తూ ఉంటారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి పలు రకాల నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీరును అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి కిడ్నీ సమస్యలు రావని నిపుణులు తెలుపుతున్నారు. అయితే మూత విసర్జనకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయితే కిడ్నీ ఫెయిల్యూర్‌కు సంకేతాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా కళ్ళు, చర్మం సమస్యలు కూడా కిడ్నీల విఫలం వల్లే వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ సమస్య:
కిడ్నీ సరిగా పనిచేయకపోతే చర్మం పొడిబారడం, చర్మంపై పొట్టు, దురద వంటి సమస్యలు రావొచ్చు. నిజానికి కిడ్నీలు రక్తంలోని టాక్సిన్లను ఫిల్టర్ చేసి.. మంచి రక్తాన్ని చర్మానికి పంపుతాయి. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే.. చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చర్మ సమస్యలు ఉత్పన్నమయితే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
కంటి సమస్యలు:
కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా కంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. కళ్ల చుట్టూ వాపులు, స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు కిడ్నీలు విఫలం కావడం వల్లే వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook