MLA Raja Singh: రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నిలబడుతుందా? ఏడాది పాటు జైలులో ఉండాల్సిందేనా? లాయర్లు ఏం చెబుతున్నారు?

MLA Raja Singh:  గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైలులో ఉన్నారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు హైదరాబాద్ పోలీసులు.చర్లపల్లి జైలులో రాజాసింగ్ కు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించారు.పీడీ యాక్ట్ నమోదు చేసిన నేతలు మూడు నెలల నుంచి ఏడాది పాటు జైలులో ఉంటారని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 27, 2022, 01:17 PM IST
  • చర్లపల్లి జైలులో ఎమ్మెల్యే రాజాసింగ్
  • కీలకంగా మారిన అడ్వైజరీ బోర్డు కమిటీ
  • రాజాసింగ్ బయటికి వస్తారా?
MLA Raja Singh: రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నిలబడుతుందా? ఏడాది పాటు జైలులో ఉండాల్సిందేనా? లాయర్లు ఏం చెబుతున్నారు?

MLA Raja Singh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైలులో ఉన్నారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు హైదరాబాద్ పోలీసులు. చర్లపల్లి జైలులో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించారు. రాజాసింగ్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండటం.. చర్లపల్లి జైలులో పలువురు ఉగ్రవాదులు ఖైదీలుగా ఉండటంతో రాజా సింగ్ కు ప్రత్యేక బ్యారక్ కేటాయించి అదనపు భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయనకు మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి. రాజాసింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రివోక్ చేసేందుకు ఆయన టీమ్ లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో రాజాసింగ్ కేసులో ఏం జరగనుంది.. ఆయన బెయిల్ పై బయటికి వస్తారా లేక పోలీసు వర్గాల చెబుతున్నట్లు ఏడాది పాటు రాజాసింగ్ జైలులో ఉండాల్సిందేనా అన్న చర్చలు సాగుతున్నాయి.

పీడీ యాక్ట్ నమోదు చేసిన నేతలు మూడు నెలల నుంచి ఏడాది పాటు జైలులో ఉంటారని తెలుస్తోంది. అయితే పీడీ యాక్ట్ కేసుల్లో అడ్వైజరీ కమిటీ నిర్ణయం కీలకంగా ఉండనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు పరిధిలోనే పిడి యాక్ట్ కేసులు ఉంటాయి. తెలంగాణలో ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటైంది. ఈ బోర్డు పిడి యాక్ట్ ప్రపోజర్స్ ను పరీశీలించి నిర్ణయం తీసుకోనుంది. రాజా సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు కావడంతో.. అతన్ని విచారించనుంది అడ్వైజరీ బోర్డు కమిటి. రాజాసింగ్ కు సంబంధించి పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలు పరీశీలించనుంది. అడ్వైజరీ బోర్డు కమిటి విచారణ తర్వాతే  రాజాసింగ్ తరపు లాయర్లకు హైకోర్టులో పిటిషన్ వేసుకొని అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణలో చాలా కేసుల్లో పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు కమిటి ఎత్తివేసిందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత ఎనిమిది ఏళ్లలో 2 వేల 573 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. గత ఏడాదిలో 664 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్టు సమాచారం. అయితే వీటిలో దాదాపు 80 శాతం కేసుల్లో పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్టు కమిటీ కొట్టివేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పై నమోదైన పీటీ యాక్ట్ ను రివోక్ చేసేందుకు ఆయన తరపు లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చర్లపల్లి జైలులో రాజాసింగ్ ను ఆయన లాయర్లు ములాఖత్‌ ద్వారా కలిసి చర్చించారు. అడ్వైజరీ కమిటీ బోర్డు రాజాసింగ్ కు అనుకూలంగా సానుకూలం నిర్ణయం తీసుకోకపోతే.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Read also: NEET: లోదుస్తులు విప్పించిన వివాదం.. ఆ విద్యార్థినులకు మరో ఛాన్స్ ఇచ్చిన ఎన్‌టీఏ..  

Read also: KTR ON BJP: జేపీ నడ్డా చెప్పులు మోసేందుకు తీవ్ర పోటీ! తెలంగాణ బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x