Train Viral Video: రెప్పపాటులో మృత్యువు తప్పడమంటే ఇదే. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించకమానదు. కొద్ది సెకన్లే తేడా..లేకుంటే ప్రాణాలు పోయేవే..ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆసక్తి రేపేవిగా ఉంటే కొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇంకొన్ని భయం రేపుతాయి. కొన్నైతే ఒళ్లు జలదరించేస్తుంటాయి. చాలా సందర్భంగా ప్రమాదానికి సంబంధించిన వీడియోలు షాకింగ్ కల్గిస్తూ వైరల్ అవుతుంటాయి. అటువంటిదే ఈ వీడియో. ఈ వీడియో రెప్పపాటులో ఓ మహిళ మృత్యువు నుంచి తప్పించుకోవడం గమనిస్తే..ఒళ్లు జలదరించడం ఖాయం...
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ మహిళ నిర్లక్ష్యంపై చీవాట్లు పెడుతున్నారు. ఇంకొందరు భూమ్మీద ఇంకా నూకలున్నాయంటున్నారు. మరి కొందరు ప్రయాణీకులు ఇలా చేయకూడదని హితవు పలుకుతున్నారు. కేవలం లగేజ్ కోసం ఎదురుగా వస్తున్న మృత్యువును పట్టించుకోలేదు ఆ మహిళ. కొద్దిపాటి తేడాలో మృత్యువు నుంచి తప్పించుకుంది. సిగ్నల్ లేక స్టేషన్‌కు దూరంలో పట్టాల మధ్యలో ఆగింది ఓ రైలు. చాలామంది ప్రయాణీకులు దిగిపోయి..అక్కడే ఉన్న మరో ట్రాక్ దాటుతున్నారు. అలాగే ఓ గ్రూప్‌లోని ఓ మహిళ లగేజ్ తీసుకుని ట్రాక్ దాటింది. ఇంకా మిగిలిన లగేజ్ తీసుకునేందుకు మరోసారి ట్రాక్ దాటి ఇటొచ్చింది. ఇలా ట్రాక్ దాటిందో లేదో..రెప్పపాటు వ్యవధిలోనే ఎదురుగా అదే ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ రైలు శరవేగంతో దూసుకొచ్చేసింది. భయంతో అక్కడే పక్కన కూర్చుండిపోయింది. కేవలం 2-3 సెకన్ల తేడాతో మృత్యువు నుంచి తప్పించుకుంది ఆ మహిళ.
ज़िंदगी आपकी है. फ़ैसला आपका है. pic.twitter.com/eMrl65FiCj
— Awanish Sharan (@AwanishSharan) July 19, 2022
ఈ వీడియోను ఓ ఐఏఎస్ అధికారి అవానిష్ శరణ్ మంచి వ్యాఖ్యతో షేర్ చేశారు. ఇది మీ జీవితం..నిర్ణయం కూడా మీదే అంటూ రాశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 368 వేల మంది వీక్షించారు. పెద్ద ఎత్తున లైక్స్, కామెంట్లు వచ్చి పడుతున్నాయి.
Also read: Hyderabad Metro Girl Dance: మెట్రో స్టేషన్లో అందమైన యువతి డ్యాన్స్.. నిమిషాల్లో వైరల్ అయిన వీడియో!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook