Shani Jayanti 2022: ఇవాళ 4 రాశులవారికి 'రాజయోగం' పట్టనుంది.. అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి!

Shani Jayanti 2022: ఇవాళ శని జయంతితో పాటు వట సావిత్రి వ్రతం కూడా జరుపుకుంటారు. అంతే కాకుండా సోమవతి అమావాస్య రావడం కూడా చాలా శుభప్రదం. ఈ రోజున 4 రాశుల వారికి రాజయోగం ఉంది. ఆ రాశులేంటో చూద్దాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 09:19 AM IST
Shani Jayanti 2022: ఇవాళ 4 రాశులవారికి 'రాజయోగం' పట్టనుంది.. అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి!

Shani Jayanti 2022 and Vat Savitri Vrat 2022: మే 30 అంటే ఈరోజు శని జయంతి. జ్యేష్ఠ మాసం అమావాస్య నాడు శని జయంతి (Shani Jayanti 2022) జరుపుకుంటారు. ఇదే రోజు సోమవతి అమాస్య (Somvati Amavasya 2022) కూడా వచ్చింది. ఈ ఏడాది ఇదే చివరి అమవాస్య. దీని తర్వాత సంవత్సరం మొత్తంలో సోమవారం ఏ అమావాస్య రాదు. దీంతో పాటు ఈరోజు వట సావిత్రి వ్రతం(Vat Savitri Vrat) కూడా నిర్వహించనున్నారు. అంతేకాకుండా 30 సంవత్సరాల తర్వాత, శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉండటం అరుదైన యాదృచ్ఛికం. దీని ప్రభావం వల్ల 4 రాశుల వారికి రాజయోగం ఏర్పడబోతుంది. ఆ రాశులేంటో చూద్దాం. 

మేషం (Aries): మేష రాశి వారు శనిదేవుని అనుగ్రహంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ వ్యక్తులు చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. యాత్రకు వెళ్ళవచ్చు. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి ఈ రోజు చాలా శుభప్రదం. 

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి శనిదేవుని అనుగ్రహం వల్ల తగినంత ధనం ​​లభిస్తుంది. దీంతో వారి అనేక ఆర్థిక సమస్యలు తీరుతాయి. కార్యాలయంలో లాభాలు ఉంటాయి. గౌరవం లభించే అవకాశాలు ఉన్నాయి. 

తుల (Libra): శని దేవుడు తుల రాశి వారికి అనేక కొత్త మార్గాల ద్వారా ప్రయోజనం చేకూరుస్తాడు. పెద్ద విజయం సాధించవచ్చు. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు, ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు పెద్ద ఆర్డర్‌లు లేదా ఒప్పందాలను పొందవచ్చు.

వృశ్చికం (Scropio): వృశ్చిక రాశి వారిపై కూడా శని దయ ఉంటుంది. వృత్తిలో లాభాలు ఉంటాయి. కొత్త ఉద్యోగాలు పొందడానికి మార్గం తెరవబడుతుంది. వ్యాపారస్తులు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. 

Also Read: Gemology: కెరీర్‌లో విజయం సాధించాలంటే.. ఈ రత్నాలను ధరించండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News