India corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- తాజాగా ఎన్నికేసులంటే..

Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 2.09 లక్షల కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 10:02 AM IST
  • దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్​
  • 18 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
  • 1.20 శాతంగా మరణాల రేటు
India corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- తాజాగా ఎన్నికేసులంటే..

India corona Cases: దేశంలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గింది. తాజాగా ఒక్క రోజులో 2,09,918 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 13,31,198 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు వెల్లడించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.

యాక్టివ్​  కేసులు ఇలా..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,831,268 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.43 శాతంగా ఉంది.

మరణాలు ఇలా..

కరోనా కారణంగా తాజాగా 959 మంది మృతి చెందారు. దీనితో దేశంలో కరోనా మృతుల సంఖ్య 495,050 వద్దకు చేరింది. కొవిడ్​ మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.

రికవరీల వివరాలు..

ఇప్పటి వరకు దేశంలో 41,302,440 మందికి కరోనా సోకగా.. అందులో  38,976,122 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

ఆదివారం ఒక్క రోజు దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 28,90,986 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. సెలవు దినం కావడంతో వ్యాక్సినేషన్ సంఖ్య భారీగా తగ్గింది. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,66,03,96,227 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 375,240,488 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,681,744 మంది మహమ్మారికి బలయ్యారు. 296,475,947 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 73,082,797 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Liquor in Supermarkets: మందుబాబులకు గుడ్ న్యూస్.. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి!

Also read: Punjab Assembly Election: రెండు చోట్ల నుంచి బరిలో దిగనున్న పంజాబ్ సీఎం చన్నీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News