Punjab Crisis: పంజాబ్‌లో సంక్షోభం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే నాయకత్వ మార్పు రానుంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. పంజాబ్‌లో అసలేం జరిగింది.
పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navajyoth singh sidhu), ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మధ్య గత కొద్దికాలంగా ఉన్న విభేదాలు పెరిగి పెద్దదయ్యాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ముదిరిపోయింది. సిద్ధూతో విభేదాల నేపధ్యంలో ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకు లేఖ రాసినట్టు సమాచారం. సోనియా గాంధీపై గౌరవంతోనే ఇన్నాళ్లూ..రాష్ట్ర కాంగ్రెస్‌లో జరిగిన నాయకత్వ మార్పుల్ని అంగీకరించానని..ఇకపై పార్టీలో ఉండలేనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ పార్టీలో జరిగిన అవమానాలు చాలని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
2022 ఫిబ్రవరిలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections) జరగనున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరిందర్ సింగ్‌పై సిద్దూ నేతృత్వంలోని ఓ వర్గం విమర్శలు చేస్తూ వస్తోంది. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలనేది ఆ వర్గం ప్రయత్నం. ఇప్పుడు ఆవర్గం పైచేయి సాధించినట్టు తెలుస్తోంది. పీసీసీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సీఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అటు ఈ సీల్పీ సమావేశం కూడా కాంగ్రెస్ అధిష్టానం అంగీకారంతోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. పంజాబ్‌లో నాయకత్వం మార్చాలని పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయించినట్టు సమాచారం. సీఎల్పీ సమావేశం కంటే ముందే అమరిందర్ సింగ్ రాజీనామా ఖరారైతే కొత్త ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకోనున్నారు. సునీల్ జాఖడ్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఛీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చని తెలుస్తోంది. పీసీసీ పగ్గాలను సిద్దూకు అప్పగించినప్పట్నించి పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్(Amarinder singh) మద్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సునీల్ జాఖడ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి.
Also read: Green Tea: గ్రీన్ టీ ఎప్పుడు, ఎలా పుట్టింది, గ్రీన్ టీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook