CM KCR's health condition latest updates: సీఎం కేసీఆర్‌కి కరోనా సోకినట్టు ఇవాళ జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆయనను ఫామ్‌హౌజ్‌లోనే ఐసోలేట్ కావాల్సిందిగా సూచించామని కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు (CM KCR's personal Dr MV Rao) తెలిపారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆయన.. ముఖ్యమంత్రికి కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఒకవేళ అత్యవసర వైద్య సహాయం అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తుంది కానీ లేకపోతే అక్కడే ఉండి చికిత్స తీసుకుంటారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్ తరలించాల్సి వస్తే.. సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో సీఎం కేసీఆర్‌కి అవసరమైన వైద్య సహాయం కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎం.వి. రావు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక (Nagarjunasagar by-polls) కోసం ఈ నెల 14వ తేదీన హలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్‌కి సమీపంగా వచ్చిన మంత్రులు, టీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు సైతం అప్రమత్తయ్యారు. మరోవైపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన నోముల భగత్‌తో (Nomula Bhagath tested positive) పాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అలాగే మరో టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి కూడ కరోనా సోకినట్టు తెలుస్తోంది.
CM KCR health updates: అత్యవసర వైద్యం కోసం ఏర్పాట్లు సిద్ధం