Andhra Pradesh: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి Ram Nath Kovind, పోలీసుల భారీ బందోబస్తు

President Ram Nath Kovind AP Tour: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు రామ్‌నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 7, 2021, 09:50 AM IST
  • చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
  • మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లెకు రాష్ట్రపతి
  • రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నేటి పర్యటన వాయిదా
Andhra Pradesh: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి Ram Nath Kovind, పోలీసుల భారీ బందోబస్తు

President Ram Nath Kovind One Day Visit Chittoor: దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేయనున్నారు. నేడు (ఫిబ్రవరి 7న) బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లెకు రాష్ట్రపతి కోవింద్ చేరుకోనున్నారు. రాష్ట్రపతికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలకనున్నారు. 

 

తన పర్యటనలో భాగంగా పలు ఆశ్రమ నిర్మాణాలు, స్వస్థ్య ఆస్పత్రికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) శంకుస్థాపన చేయనున్నారు. తొలుత మదనపల్లెలోని సుప్రసిద్ధ తత్వవేత్త ముంతాజ్‌ అలీ సత్సంగ్‌ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తారు. ఓ యోగా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కొన్ని గంటలపాటు అక్కడే సమయం గడపనున్న రామ్‌నాథ్ కోవింద్, సదుం మండలంలోని  పీపల్‌ గ్రో పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 

Also Read: Gold Price Today In Hyderabad: భారీగా పెరిగిన Gold Rates, పసిడి దారిలోనే Silver Price

 

ఆదివారం సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరతారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం పర్యటన రద్దయింది. 

Also Read: Today Horoscope 07 February 2021: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 7, 2021 Rasi Phalalu 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News