Thandel OTT Steaming date: అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్య కారులు అనుకోకుండా పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కుతారు. దీంతో వాళ్లను అక్కడ జైల్లో ఉంచుతారు. వాళ్లను విడిపించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే దాన్ని చందూ మొండేటి ఎంతో భావోద్వేగ భరితంగా తెరకెక్కించాడు. అది వసూళ్ల వర్షం కురిపించింది.
ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర రూ. 59 కోట్ల షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా అక్కినేని హీరోల్లో ఈ జమానాలో రూ. 100 కోట్ల గ్రాస్ అనేది మాములు విషయం కాదు. మొత్తంగా వరుసగా కెరీర్ లో రెండు డిజాస్టర్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ చిత్రం హీరోగా నాగ చైతన్యకు మంచి ఊపు ఇచ్చింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
అంతేకాదు శోభితతో రెండో పెళ్లి తర్వాత దక్కిన తొలి విజయం. ఓ రకంగా శోభిత చైతూ జీవితంలో వచ్చిన తర్వాత దక్కిన తొలి సక్సెస్ కావడంతో అక్కినేని ఫ్యామిలీకి ఇది ప్రత్యేకమైన సినిమాగా చెప్పాలి. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా మార్చి 7న నెట్ ఫ్లిక్స్ లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.