Hyderabad lady doctor Washed Away In Tungabhadra River Karnataka: చాలా మంది తమ స్నేహితులు, ఫ్యామిలీస్ తో కలిసి కొత్త సమ్మర్ రాగానే లేదా సెలవులు రాగానే విహార యాత్రలకు వెళ్తుంటారు. తమ వారితో కలసి ఒత్తిడినుంచి బైటపడేందుకు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు విహార యాత్రల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటాయి. దీంతో విహార యాత్రలు కాస్త.. విషాద యాత్రలుగా మారిపోతాయి.
అచ్చం ఇలాంటి ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. హైదరబాద్ లోని నాంపల్లికి చెందిన డాక్టర్ అనన్యరావు మోహన్‌రావు , తన స్నేహిరాలు అషిత, స్వాతిక్‌లతో కలిసి మంగళవారం సాయంత్రం విహారయాత్రకు కర్ణాటకలోని గంగావతి జిల్లాకు వెళ్లారు. అక్కడే సనాపూర్ కి దగ్గరలో గెస్ట్ హౌస్ లో దిగారు.
#KoppalMishap #Sanapur
Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025
అయితే.. వీరంతా తుంగభద్రనదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ అనన్య రావు 25 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. కాసేపు బాగానే స్విమ్మింగ్ చేసింది . అయితే కొద్దిసేపటికే మరోవైపు నుంచి అలలు రావడంతో నీటి ప్రవాహంలో డాక్టర్ పైకి ఎక్కలేక ఇబ్బందులు పడింది. ఆమె కళ్ల ముందు చూస్తుండగానే కొట్టుకుపోయింది.ఈ ఘటనను ఆమె స్నేహితులు వీడియోలు తీశారు.
ఈ విషయాన్ని గుర్తించిన స్నేహితులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెంటనే దగ్గరలోని పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే లేడీ డాక్టర్ నీటి ప్రవాహాంలో కొట్టుకుపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లి ఒక నిండు ప్రాణం పొవడంతో ఒక వైపు కుటుంబ సభ్యులు, మరొవైపు ఆమె స్నేహితులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి