Sivangi: ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించారు. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా శివంగి రాబోతుంది. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రాజమౌళి తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న డెరైక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేయడం విశేషం. ఈ మూవీ ఎంత పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో వుండబోతోందో ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది.
నల్ల లుంగీ, చొక్కాతో కాళ్ళపై కాళ్లు వేసుకొని సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది లుక్ స్టన్నింగ్ వుంది. విమెన్ సెంట్రిక్ సినిమాలలో శివంగి గ్రౌండ్ బ్రేకింగ్ కథ స్క్రీన్ ప్లే తో వుండబోతోంది. ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి A.H కాషిఫ్ - ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. భరణి కె ధరన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. మార్చి 7న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఢిపరెంట్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.