Bharat Vs Bangladesh: ICC ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ.. ఉత్కంఠ రేపనున్న ఇండియా తొలి మ్యాచ్..

Bharat Vs Bangladesh: ICC ఛాంపియన్‌ ట్రోఫీ లో తొలి లీగ్‌ మ్యాచ్‌ను టీం భారత్ ఇవాళ  బంగ్లాదేశతో ఆడనుంది. ఇప్పటికే భారత్‌ మంచి జోరుమీద వుంది.  అయితే బంగ్లాదేశ్‌ బలహీనంగా కనిపిస్తోంది. ఛాంపియన్ ట్రోఫీ భారత్ ఆడనున్న తొలి ఆటకు అంతా సిద్ధమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 20, 2025, 10:48 AM IST
Bharat Vs Bangladesh: ICC ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ.. ఉత్కంఠ రేపనున్న ఇండియా తొలి మ్యాచ్..

Bharat Vs Bangladesh: ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు భారత్, బంగ్లాదేశ్ మధ్య భీకర పోరు జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్‌ తర్వాత 12 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్‌.. నాలుగు మాత్రమే గెలిచింది. లిటన్‌ దాస్‌, షకిబ్‌అల్‌ హసన్‌ వంటి స్టార్లు లేకపోయినా ముష్ఫీకర్‌, మిరాజ్‌, నహిద్‌ రాణా, టస్కిన్‌ అహ్మద్‌ వంటి ప్రతిభావంతమైన ఆటగాళ్లు  ఆజట్టులో ఉన్నారు. ఏ జట్టునైనా సవాల్‌ చేయగల సత్తా బంగ్లాదేశ్‌ సొంతం. కానీ నిలకడలేమి ఆ టీమ్ ప్రధాన శత్రువు. ఈ నేపథ్యంలో భారత్‌ను బంగ్లా ఏ మేరకు నిలువరిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.    

ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. రెట్టించిన ఉత్సాహంతో చాంపియన్స్‌ బరిలోకి దిగింది. బ్యాటింగ్‌ విభాగంలో టీమ్‌ఇండియాకు కష్టాలేం లేవు. కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడ్డ  బ్యాటర్లు రోహిత్‌, కోహ్లీ ఇంగ్లండ్‌ సిరీస్‌తో టచ్‌లోకి వచ్చారు. ఓపెనర్‌ గిల్‌ కూడా రెండు హాఫ్‌ సెంచరీలు.. ఓ శతకంతో జోరుమీదున్నాడు.

దేశవాళీలో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన శ్రేయస్‌  దూకుడుతో సాగుతున్నాడు. అయితే వచ్చిన సమస్యల్లా ఐదో స్థానంలో ఎవరిని ఆడించాలనేది జట్టు తేల్చుకోలేకపోతోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేలలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. అక్షర్‌ను ఐదో స్థానంలో పంపించి సక్సెస్‌ అయింది. మళ్లీ మూడో వన్డేలో రాహుల్‌ను ఇదే స్థానంలో ఆడిస్తే అతడూ తనకు అచ్చొచ్చిన స్థానంలో మెరిశాడు. మరి చాంపియన్స్‌ ట్రోఫీలో ఐదో స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

బ్యాటింగ్‌ విభాగంలో భారత్‌కు ఇబ్బందులు లేవు.  బౌలింగ్‌ విభాగం మాత్రం కాస్త వీక్‌గా ఉంది. బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీపై భారం పడనుంది. అతడికి అండగా హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఎంపికచేసినా ఈ ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో వన్డేలు ఆడిన అనుభవం తక్కువ. ఆరంభంలో భారీగా పరుగులిచ్చుకునే బలహీనత ఇద్దరిలోనూ ఉంది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో హర్షిత్‌ వికెట్లు పడగొట్టినా ఈ టోర్నీలో అర్ష్‌దీప్‌ వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపే అవకాశముంది. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయడంలో అతడు సిద్ధహస్తుడు. ఇక పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నెమ్మదిగా స్పందించే దుబాయ్‌ పిచ్‌లపై స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలున్న నేపథ్యంలో భారత్‌ ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగొచ్చు. ఈ టోర్నీలో భారత్‌ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పించింది. అక్షర్‌, జడేజా, కుల్‌దీప్‌, వరుణ్‌, వాషింగ్టన్‌లో ఎవరికి ఆసక్తి కరంగా మారింది.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News