cm yogi Adityanath on kumbh mela water faecal bacteria controversy: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో ఎలాగైన త్రివేణి సంగమంలో స్నానం చేయాలని భక్తులు ఎంతటి వ్యయప్రయాసలకైన పడి కుంభమేళకు వస్తున్నారు. బస్సులు, రైల్వేలు, విమానాలు, సొంత వాహానాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కుంభమేళలకు ఇండియన్ రైల్వేస్ సైతం ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసింది.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది.
యూపీ యోగి ఆదిత్యనాథ్ సర్కారు సైతం.. నిరంతం అధికారులలో సమావేశం అవుతూ.. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కుంభమేళ నీళ్లలో మలంలో ఉండే బ్యాక్టిరియా ఎక్కువగా విస్తరించిందని, ఇది స్నానాలకు, తాగేందుకు ఏ విధంగా మంచిదికాదని కూడా నేషనల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు రిపోర్ట్ ఇచ్చింది.
దీనిపై దేశంలో పెద్ద చర్చ జరిగింది. దీనిపై అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. కుంభమేళ నీళ్లను తాము ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తున్నామన్నారు.దీనిలో బ్యాక్టిరియాలు ఉన్నయనడంలో వాస్తవం లేదన్నారు. తమ సిబ్బంది ఎప్పటికప్పుడు కుంభమేళ పరిసర ప్రాంతాలను, కుంభమేళ నీళ్లలో ఎలాంటి వ్యర్థాలు పేరుకుని పోకుండా చర్యలు తీసుకుంటుందరన్నారు. కొంతమంది కావాలని కుంభమేళపై చెడు ప్రచారం చేస్తున్నారన్నారు.
ఇటీవల కుంభమేళకు.. సమాజ్ వాది పార్టీ ఇంత ఖర్చులు అవసరమా..అందని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుంభ్ ను 'ఫాల్తు' అని మాట్లాడారన్నారు. వీరుమాత్రమే కాకుండా... సమాజ్ వాదీ పార్టీ మరో భాగస్వామి (మమతా బెనర్జీని ప్రస్తావిస్తూ) మహా కుంభ్ 'మృత్యు కుంభ్'గా మారిందని అన్నారు.
సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం నేరమైతే, తమ ప్రభుత్వం ఆ నేరాన్ని చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇాలాంటి చెడు ప్రచారంలో.. 56 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించిన వారి విశ్వాసాలతో ఆడుకున్నట్లు అన్ని యోగి సీరియస్ అయ్యారు. మరోవైకు కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుందని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి